Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీని కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదు

ఇటలీని భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైన ఈ భూకంపం తీవ్రత కారణంగా సెంట్రల్ ఇటలీ ఊగిపోయింది. ప్రకంపనల ధాటికి పలు పలు ఇళ్లు కంపించాయని, ఇళ్లలోని సామాగ్రి స్వల్పంగా దెబ్బతినట్టు స్థాన

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2016 (13:52 IST)
ఇటలీని భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైన ఈ భూకంపం తీవ్రత కారణంగా సెంట్రల్ ఇటలీ ఊగిపోయింది. ప్రకంపనల ధాటికి పలు పలు ఇళ్లు కంపించాయని, ఇళ్లలోని సామాగ్రి స్వల్పంగా దెబ్బతినట్టు స్థానిక మీడియా తెలిపింది. రోమ్‌లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నారు. 
 
ఈ భూకంప కేంద్రంగా ఆగ్నేయ పెరుగ్వియాకు 68 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు గుర్తించారు. గత బుధవారం కూడా మధ్య ఇటలీలో రెండుసార్లు భూప్రకంపనలు చోటుచేసుకోగా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కాగా, ఆదివారంనాడు భూకంప తీవ్రత 7.1గా యుఎస్‌జీఎస్, ఇటాలియన్ మీడియా తొలుత ప్రకటించాయి. 
 
అయితే ఆ తర్వాత యూరోపియన్ మెటిరేటియన్ సిస్మొలాజికల్ సెంటర్ (ఈఎంఎస్‌సీ) ఈ తీవ్రతను 6.6గా పేర్కొంది. కాగా, ప్రకంపనల ధాటికి పలు ప్రాంతాల్లో ఇళ్లు కుప్పకూలినట్టు ఇటలీ సివిల్ ప్రొటక్షన్ అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టారు. అయితే మృతుల సంఖ్య గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హృదయాలను హత్తుకునేలా గాంధీ తాత చెట్టు - రివ్యూ

నాకు వేల కోట్ల క్లబ్ వద్దు - దేవుడిచ్చింది చాలు : వెంకటేష్

తిరుపతిలో సెటిల్ అవుతా, గోవిందా... గోవిందా నామస్మరణతో నిద్రలేస్తా: జాన్వీ కపూర్

సంక్రాంతికి వస్తున్నాం.. జబర్దస్త్ స్కిట్టా? దర్శకుడు అనిల్ ఏమంటున్నారు?

రామ్ చరణ్ మూవీలో మత్తుకళ్ళ మోనాలిసా!!?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

తర్వాతి కథనం
Show comments