Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీ-7 సదస్సు: భారత ప్రతినిధుల్లో ఇద్దరికి కరోనా.. స్వీయ నిర్భంధంలో..?

Webdunia
బుధవారం, 5 మే 2021 (15:44 IST)
జీ-7 సదస్సులో పాల్గొనేందుకు లండన్ వెళ్లిన భారత ప్రతినిధుల్లో ఇద్దరికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ప్రతినిధుల బృందంలోని సభ్యులంతా స్వీయ ఐసొలేషన్‌లో ఉన్నట్లు బ్రిటన్ ప్రభుత్వం బుధవారం తెలిపింది. 
 
జీ 7 గ్రూప్‌లో భారత్ సభ్య దేశం కాదు. అయినప్పటికీ లండన్‌ జరిగే ఈ సదస్సుకు భారత్‌తోపాటు ఆస్టేల్రియా, దక్షిణ ఆఫ్రికా, దక్షిణ కొరియా దేశాలను బ్రిటన్ ఆహ్వానించింది. దీంతో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌తో కూడిన భారత ప్రతినిధుల బృందం లండన్‌కు వెళ్లింది.
 
మరోవైపు కరోనా నేపథ్యంలో ప్రతినిధులకు ప్రతి రోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రతినిధుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వారందరినీ స్వీయ ఐసొలేషన్‌లో ఉంచినట్లు బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.
 
భారత ప్రతినిధులు వర్చువల్‌గా సదస్సులో పాల్గొంటారని పేర్కొంది. అయితే కేంద్ర మంత్రి జైశంకర్‌కు కరోనా సోకలేదని వెల్లడించింది. కాగా, ఆయన బ్రిటన్ అంతర్గత మంత్రితో మంగళవారం సమావేశమైనట్లు స్థానిక మీడియా పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు ల‌ ఒసేయ్ అరుంధతి

హీరో సూర్య 45 సినిమా ఆనైమలైలో గ్రాండ్ గా లాంచ్

మహేష్ బాబు లాంచ్ చేసిన ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments