Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులకు చుక్కలు చూపించిన బొమ్మ.. రూమ్‌లో ఉరి కంబానికి వేలాడుతూ.. కాలింగ్ బెల్ కొట్టినా..?!

ప్రజలకు చుక్కలు చూపిస్తున్న ఖాకీలకు ఓ బొమ్మ మూడు చెరువుల నీళ్లు తాగించింది. అసలు విషయం ఏంటంటే.. నెద‌ర్లాండ్‌ తూర్పు ఆమ్స్టర్డ్యామ్లోని ఓ అపార్ట్మెంట్లో ఓ మహిళ ఉరేసుకుందని స్థానికులు పోలీసులకు సమా

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (15:24 IST)
ప్రజలకు చుక్కలు చూపిస్తున్న ఖాకీలకు ఓ బొమ్మ మూడు చెరువుల నీళ్లు తాగించింది. అసలు విషయం ఏంటంటే.. నెద‌ర్లాండ్‌ తూర్పు ఆమ్స్టర్డ్యామ్లోని ఓ అపార్ట్మెంట్లో ఓ మహిళ ఉరేసుకుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు పరుగోపరుగని అక్కడికి చేరుకున్నారు. కాలింగ్ బెల్ కొట్టినా ఎవరూ స్పందించకపోవటంతో చివరికి తలుపులు పగలగొట్టి.. ఇంట్లోకి ప్రవేశించారు. 
 
తలుపు బద్దలు కొట్టి చూసి పోలీసులతో పాటు స్థానికులు కూడా తెల్లమొహం వేశారు. ఇంతకీ అక్కడ ఉన్నది మహిళ కాదు బొమ్మ. బొమ్మ అచ్చం మ‌హిళ‌లాగే క‌నిపించింద‌ని, అంతేకాక వేలాడుతూ ఉండ‌డంతో మ‌హిళ ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటుంద‌ని తాము భావించిన‌ట్లు స్థానికులు చెప్పారు. రూంలో వేలాడుతూ క‌నిపించింది మ‌హిళ కాక‌పోవ‌డంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఆ మహిళను దగ్గరగా పరిక్షించి చూస్తేగానీ తెలియలేదు.. అది గాలితో నింపిన బొమ్మ అని. ఈ అనుభవాన్నంతా మీడియాకు వెల్లడించిన పోలీసులు.. అది బొమ్మ అయినందుకు సంతోషంగా ఉందన్నారు. ఆమ్స్టర్డామ్లో సెక్స్ వర్క్కు చట్టబద్ధత ఉంది. అక్కడ సెక్స్ షాపుల్లో ఇలాంటి సెక్స్ టాయ్స్ విరివిగా లభిస్తాయి. అయితే బొమ్మకు ఎందుకు ఉరివేశారు అనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదని వెల్లడించారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం