Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీరు తాగండి.....వ్యాక్సిన్‌ తీసుకోండి: బైడెన్‌

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (11:23 IST)
'బీరు తాగండి...హెయిర్‌ కట్‌ చేసుకోండి..వ్యాక్సిన్‌ తీసుకోండి' అంటూ అక్కడి ప్రజలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మేలుకొల్పుతున్నారు. వచ్చే నెల 4న అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం నాటికి అమెరికాలోని వయో జనాభాలో 70 శాతం మంది టీకాలు తీసుకునేందుకు చేపడుతున్న భారీ ప్రయత్నాల్లో భాగంగా బైడెన్‌ ఈ పిలుపునిచ్చారు.

'వ్యాక్సిన్‌ తీసుకోండి..బీర్‌ తాగండి' అంటూ తన స్వాతంత్య్ర దినోత్సవ లక్ష్యాన్ని చేరుకునే ప్రచారానికి తెర తీశారు. అందుకు తగ్గట్లు అన్హ్యూజర్‌-బుష్‌ కంపెనీలకు సంబంధించిన బీర్లను అందుబాటులో ఉంచడం నుండి బార్బర్‌ షాపుల వరకు తగిన ఏర్పాటు చేశారు. తాము అమెరికా ప్రజల సాయాన్ని కోరుతున్నాం అంటూ వ్యాఖ్యానించారు.

కోవిడ్‌ -19 ప్రతి ఒక్కరినీ ఇబ్బందులకు గురి చేస్తోందని, కోవిడ్‌ నుండి స్వాతంత్య్రాన్ని పొంది, మరో సంవత్సరం ఆరోగ్యంగా జీవించేందుకు మనల్ని..మనం రక్షించుకుందాం అంటూ సందేశం ఇచ్చారు. వ్యాక్సినేషన్‌లో 70 శాతం లక్ష్యాన్ని సాధిస్తామన్నా ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం 63 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిందని చెప్పారు. ఇప్పటికే 12 రాష్ట్రాలు 70 శాతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను దాటాయని, మరికొన్ని కొన్ని రోజుల్లో ఈ శాతానికి చేరుకుంటాయని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments