Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటర్ బోర్డింగ్‌ను తిరిగి అమలు చేయాల్సిందే: డొనాల్డ్ ట్రంప్

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (13:30 IST)
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున పోటీ పడతారని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తీవ్రవాదులపై మరోసారి విరుచుకుపడ్డారు. ఇస్లామిక్ స్టేట్ నుంచి ఎదురయ్యే సమస్యల్ని అరికట్టాలంటే.. వివాదాస్పద ఇంటరాగేషన్ పద్ధతి వాటర్ బోర్డింగ్‌ను వాడాల్సిందేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. మనమంతా మధ్య యుగంలో ఉన్నట్లుందని.. తనవరకైతే వాటర్ బోర్డింగ్‌ను తిరిగి అమలు చేయాలని కోరుతానని.. అంతకంటే కఠిన పద్ధతులు ఉంటే వాటినీ తిరిగి తీసుకురావాలన్నదే తమ అభిమతమని చెప్పారు.
 
వాటర్ బోర్డింగ్ అంటే.. ఓ వ్యక్తిని ఓటవాలుగా ఉన్న బల్లపై తలకిందకు వచ్చేట్లు పడుకోబెట్టి కాళ్లూ చేతులూ కట్టేసి ముఖానికి ముసుగు తొడుగుతారు. ఆపై ముఖంపై ధారగా నీరు పోస్తారు. విచారణ ఎదుర్కొనే వ్యక్తి ఊపిరి పీల్చుకోలేకపోతాడు. ముక్కుల్లో నుంచి నీరు ఊపిరితిత్తుల్లోకి, మెదడు‌లోకి చేరిపోతుంది. ఈ ఇంటరాగేషన్ పద్ధతిని గతంలో గ్వాంటనామా బేలో అమలు చేసినట్టు తెలుస్తోంది. 
 
ఈ వాటర్ బోర్డింగ్ దారుణ హింస. వాటర్ బోర్డింగ్‌ను ఎదుర్కొనే వారు ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతారు. తట్టుకుని నిలిస్తే మాత్రం పిచ్చివారైపోతారని సమాచారం. దీన్ని నిషేధించినప్పటికీ, ఇరాక్, ఆఫ్గన్ యుద్ధంలో పట్టుబడ్డ కొందరు ఉగ్రవాదులపై ప్రయోగించినట్టు వార్తలు వెలువడ్డాయి. కాగా, టెక్సాస్ సెనెటర్, రిపబ్లికన్ల తరఫున పోటీ పడుతున్న టెడ్ క్రూజ్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలకు అభ్యంతరం వ్యక్తం చేశారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments