Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్లిం దేశాలపై నిషేధం.. కింది కోర్టుల నిర్ణయాలకు ట్రంప్ సవాల్.. సుప్రీం తీర్పు కోసమే వెయిటింగ్..

ఆరు దేశాలకు చెందిన ముస్లిం పౌరులు అమెరికాలోకి అడుగుపెట్టకుండా విధించి వివాదాస్పద నిషేధాన్ని అమల్లోకి తెచ్చేందుకు డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఆ దేశ సుప్రీం కోర్టును విజ్ఞప్తి చేసింది. ట్రంప్ జనవరిలో తొలిసా

Webdunia
మంగళవారం, 6 జూన్ 2017 (13:52 IST)
ఆరు దేశాలకు చెందిన ముస్లిం పౌరులు అమెరికాలోకి అడుగుపెట్టకుండా విధించి వివాదాస్పద నిషేధాన్ని అమల్లోకి తెచ్చేందుకు డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఆ దేశ సుప్రీం కోర్టును విజ్ఞప్తి చేసింది. ట్రంప్ జనవరిలో తొలిసారి నిషేధాజ్ఞలు జారీ చేసిన నేపథ్యంలో వాటిని అమెరికా కోర్టులు నిలుపుదల చేశాయి. న్యాయపరమైన సవాళ్లను అధిగమించేందుకు మార్చిలో మరోసారి, ఆరు దేశాల పౌరులకు వీసాల జారీని నిలిపివేస్తూ ట్రంప్‌ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 
 
ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని అభిప్రాయపడ్డ నాలుగో సర్క్యూట్‌ అప్పీళ్ల కోర్టు, అమల్లోకి రాక ముందే ఈ ఉత్తర్వులను కూడా నిలిపివేసింది. దీంతో తాజాగా కిందు కోర్టుల నిర్ణయాలను సవాలు చేస్తూ ట్రంప్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
 
ఈ నేపథ్యంలో తాను ప్రతిపాదించిన ప్రయాణ నిషేధ విధానం మరింత కఠినంగా ఉండాలని ట్రంప్ ట్విట్టర్లో అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే ఈ కేసును పరిశీలిసల్తున్న సుప్రీం కోర్టు మరింత త్వరగా విచారణ పూర్తి చేయాలని కోరారు. ప్రయాణ నిషేధంపై తొలుత ఇచ్చిన ఆదేశాలకే న్యాయ విభాగం కట్టుబడి ఉండాలి. నీరుగార్చిన, రాజకీయపరంగా మార్పులు చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టుకు సమర్పించారు. వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదు. దేశ భద్రత దృష్ట్యా అమెరికా వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. కోర్టులు నెమ్మదిగా, రాజకీయంగా పనిచేస్తున్నాయని ట్విట్టర్లో ట్రంప్ వ్యాఖ్యానించారు.
 
కాగా.. ఇరాన్‌, లిబియా, సొమాలియా, సూడాన్‌, సిరియా, యెమెన్‌కు చెందినవారిని తమ దేశంలోకి రానివ్వకుండా, ట్రంప్‌ జనవరిలో తొలిసారి నిషేధాజ్ఞలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం
Show comments