Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడో పిచ్చి న్యాయమూర్తి... ఉగ్రవాదులకు మద్దతిస్తాడా? అరెస్టు చేసి జైల్లో పెట్టాలి : డోనాల్డ్ ట్రంప్ నిప్పులు

ఏడు ముస్లిం దేశ పౌరులను అమెరికాలో అడుగుపెట్టనీయకుండా తాను జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌ను నిలిపివేస్తూ ఆదేశాలిచ్చిన న్యాయమూర్తిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆగ్రహావేశాలు వ్యక

Webdunia
ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (12:31 IST)
ఏడు ముస్లిం దేశ పౌరులను అమెరికాలో అడుగుపెట్టనీయకుండా తాను జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌ను నిలిపివేస్తూ ఆదేశాలిచ్చిన న్యాయమూర్తిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆడో పిచ్చి న్యాయమూర్తి... ఉగ్రవాదులకు మద్దతిస్తాడా అంటూ నిలదీశారు. 
 
ఇమిగ్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై స్టే విధిస్తూ సియాటెల్ న్యాయమూర్తి రాబర్ట్‌ను ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు దేశ వ్యాప్తంగా విస్తరిస్తాయని పేర్కొన్నారు. వీటిపై డోనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. కోర్టులు అడ్డంపడ్డా, తనలో దూకుడు తగ్గబోదని తేల్చి చెప్పారు.
 
ఆ జడ్జికి పిచ్చి పట్టిందని, అందుకే ఉగ్రవాదులకు మద్దతిస్తున్నాడని, ఆయనపై కేసు పెట్టి జైల్లో పెట్టాలని నిప్పులు చెరిగారు. ఎంతో మంది చెడ్డవారిని అమెరికాకు తీసుకువచ్చి ఇక్కడి ప్రజలకు శాంతి లేకుండా చేయాలన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందని అన్నారు. 
 
రాబర్ట్ తీర్పు పట్ల ఐఎస్ఐఎస్ సహా పలు ఉగ్రవాద సంస్థలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయన్నారు. ఆయన తన భయంకరమైన తీర్పును సవరించుకోవాలని సలహా ఇచ్చారు. కాగా, తనకు వ్యతిరేకంగా తీర్పు రావడాన్ని ట్రంప్ జీర్ణించుకోలేక ఇలా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments