2024 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానంటున్న అమెరికా అధ్యక్షుడు!

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (07:01 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. గత నెలలో జరిగిన అగ్రరాజ్య ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. కానీ, ఈ ఓటమిని ఆయన స్వీకరించడం లేదు. అంటే ప్రత్యర్థి గెలుపును అంగీకరించడం లేదు. వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో అధ్యక్ష భవనంలో క్రిస్మస్ పార్టీ జరిగింది. ఇందులో డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, గడిచిన నాలుగేళ్లు అద్భుతంగా సాగాయ‌ని, మ‌రో నాలుగేళ్లు పాలించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని, వీలైతే మ‌ళ్లీ నాలుగేళ్ల త‌ర్వాత క‌లుస్తా అన్న సందేశాన్ని ట్రంప్ వినిపించారు. 
 
రిప‌బ్లిక్ పార్టీ వ‌ర్క‌ర్లు ఆ ఈవెంట్‌కు హాజ‌ర‌య్యారు. ఈ యేడాది న‌వంబ‌ర్ 3వ తేదీన జ‌రిగిన ఎన్నిక‌ల్లో ట్రంప్ ఓడారు. కానీ ఓట‌మిని అంగీక‌రించ‌ని ఆయ‌న‌.. కొన్ని రాష్ట్రాల ఫ‌లితాల‌పై కోర్టును ఆశ్ర‌యించారు. అమెరికా నూత‌న అధ్య‌క్షుడిగా బైడెన్.. జ‌న‌వ‌రిలో ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. 
 
అ.యితే, బైడెన్‌ చేతిలో ఓటమిపాలు కావడంతో ట్రంప్‌ రాజకీయాల్లో కొనసాగుతారా? లేక తిరిగి వ్యాపార జీవితంలోకి ప్రవేశిస్తారా? అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ట్రంప్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోనే ఉంటారా? అన్న పలువురి సందేహాలకు సమాధానం దొరికినట్లయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments