Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోనాల్డ్ ట్రంప్ దూకుడు.. అమెరికా - రష్యాల మధ్య అణుయుద్ధం.. ఆమె ఏమంటోంది?

సిరియా వ్యవహారం అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనేలా చేసింది. దీంతో ఈ రెండు దేశాల మధ్య అణు యుద్ధం జరిగే అవకాశం ఉందని అమెరికా కాంగ్రెస్‌కు ఎంపికైన తొలి హిందూ మహిళ, డెమొక్రాట్‌ తులసీ గబార్డ్

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (14:29 IST)
సిరియా వ్యవహారం అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనేలా చేసింది. దీంతో ఈ రెండు దేశాల మధ్య అణు యుద్ధం జరిగే అవకాశం ఉందని అమెరికా కాంగ్రెస్‌కు ఎంపికైన తొలి హిందూ మహిళ, డెమొక్రాట్‌ తులసీ గబార్డ్ అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరే ప్రధాన కారణమని ఆమె ఆరోపిస్తున్నారు.
 
తిరుగుబాటుదారుల శిబిరాలపై సిరియా అధ్యక్షుడు ఆదేశాలతో ఆ దేశ సైన్యం రసాయన దాడులు జరిపింది. ఈ దాడుల్లో 80 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ రసాయన దాడికి ప్రతిగా షైరత్ వైమానిక స్థావరంపై అమెరికా శుక్రవారం క్షిపణులతో క్షిప‌ణుల‌తో దాడి చేసింది. ఈ దాటులపై పలు దేశాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 
 
తాజాగా ఈ చ‌ర్య‌పై హవాయిన్‌ ప్రాంతం నుంచి అమెరికా కాంగ్రెస్‌కు ఎంపికైన తొలి హిందూ మహిళ, డెమొక్రాట్‌ తులసీ గబార్డ్ స్పందించారు. ఈ దాడిని ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా నిర్లక్ష్యపూరితంగా చేశార‌ని అన్నారు. 
 
ఈ దాడులు జ‌రిపితే త‌ద‌నంత‌రం జ‌రిగే ప‌రిణామాలపై ఎవ‌రినీ సంప్ర‌దించ‌కుండానే డొనాల్డ్ ట్రంప్ ఈ చ‌ర్య‌కు దిగార‌ని అన్నారు. అసలు ఇటీవ‌ల‌ సిరియాలో జరిగింది ర‌సాయ‌న‌ దాడులా? కాదా? అని కూడా నిర్ధారించుకోకుండానే క్షిప‌ణిదాడులు నిర్వ‌హించార‌ని విమ‌ర్శించారు.
 
ఈ చ‌ర్య అల్‌ఖైదా ఉగ్ర సంస్థ‌ను మరింత బలోపేతం చేసేలా ఉంద‌ని అన్నారు. సిరియాలో ఎంతో మంది శ‌రణార్థులుగా మారే ప‌రిస్థితులు తెచ్చార‌ని అన్నారు. అంతేగాక‌, అమెరికా, రష్యా మధ్య అణుయుద్ధం కూడా జరిగే అవకాశం ఉంద‌ని తులసీ గబార్డ్ అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments