Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూయార్క్ ఫెడరల్ కోర్టు జడ్జిగా సరితా కోమటిరెడ్డి పేరు నామినేట్!

Webdunia
మంగళవారం, 5 మే 2020 (17:07 IST)
అమెరికాలో మరో ఇండో-అమెరికన్ మహిళకు అత్యున్నత పదవి దక్కనంది. న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టు జడ్జిగా సరితా కోమటిరెడ్డి పేరును ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. ఈ మేరకు సోమవారం యూఎస్ సెనేట్‌లో సరితా పేరును ఆయన ప్రతిపాదన చేశారు. అధ్యక్షుడి ప్రతిపాదనను సెనేట్ ఆమోదముద్ర వేసిన పక్షంలో సరితా కోమటిరెడ్డి న్యూయార్క్ ఫెడరల్ కోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరిస్తారు. 
 
ప్రస్తుతం ఈమె యూఎస్ అటార్నీ ఆఫీసులో న్యూయార్క్‌ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్‌కు జనరల్ క్రైమ్స్‌ విభాగానికి డిప్యూటీ చీఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, హార్వర్డ్ లా స్కూల్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సరితా కోమటిరెడ్డి.. కొలంబియాలోని యుఎస్ కోర్టు, డిస్ట్రిక్ట్ అపీల్స్‌లో క్లర్కుగా పని చేశారు. త్వరలోనే అత్యున్నత పదవిని అధిరోహించనున్న సరితా కోమటిరెడ్డి సొంతూరు తెలంగాణ. ఈమె తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments