Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్డ్ ట్రంప్ రాసలీలలు.. పనిమనిషిని కూడా వదిలిపెట్టలేదా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాసలీలలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మోడల్స్‌తో సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ వార్తలొచ్చిన నేపథ్యంలో తాజాగా... అక్రమ సంతానం కూడా ఉందనే విషయం ఇప్పుడు చర్చనీయ

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (10:33 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాసలీలలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మోడల్స్‌తో సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ వార్తలొచ్చిన నేపథ్యంలో తాజాగా... అక్రమ సంతానం కూడా ఉందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ విషయాన్ని ట్రంప్ వరల్డ్ టవర్ మాజీ కాపలాదారుడు ఒకరు తెలిపారు. పెళ్లి చేసుకోకుండానే ఓ పని మనిషితో ట్రంప్ సంబంధం పెట్టుకున్నారని... ట్రంప్ ద్వారా ఆమెకు ఓ బిడ్డ జన్మించిందని డినో సాజుదిన్ అనే కాపలాదారుడు తన న్యాయవాది ద్వారా వెల్లడించాడు.
 
ఈ విషయాన్ని ఎవరితో చెప్పకూడదని అమెరికన్ మీడియా ఇంక్‌తో తన క్లయింట్ డినో ఒప్పదం కుదుర్చుకున్నాడని... ఇప్పుడు ఆ ఒప్పందం నుంచి బయటపడ్డాడని సదరు న్యాయవాది తెలిపారు. ఈ అంశంపై వైట్ హౌస్ ఇంతవరకు స్పందించలేదు.
 
అంతేగాకుండా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వివాహేతర సంబంధాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. 2006-07 మధ్యలో పదినెలల పాటు ట్రంప్‌తో సాగిన రహస్య సంబంధంపై చేసుకున్న ఒప్పందం నుంచి తనను బయటపడేయాలంటూ ప్లేబాయ్ మాజీ మోడల్ కరెన్ మెక్ డౌగల్ లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టులో గతంలో దావా వేసిన సంగతి తెలిసిందే. 
 
డొనాల్డ్ ట్రంప్‌తో ఎఫైర్ గురించి బయటకు వెల్లడించవద్దంటూ నేషనల్ ఎంక్వైరర్ పత్రిక ప్రచురణ సంస్థ అయిన అమెరికా మీడియా ఇంక్ 2016లో తనకు లక్ష 50వేల డాలర్లు చెల్లించిందని ఆమె తన దావాలో తెలిపారు. ఈ సంస్థ అధిపతి డేవిడ్‌ పెకర్‌ గతంలో ట్రంప్‌ తన వ్యక్తిగత స్నేహితుడని ప్రకటించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments