Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు అండగా ఉండండి.. మేం యుద్ధం చేస్తాం.. ట్రంప్‌తో జపాన్ ప్రధాని

ప్రపంచ దేశాలను ధిక్కరించి ఇష్టానుసారంగా క్షిపణి ప్రయోగాలు చేస్తున్న ఉత్తర కొరియా మెడలు వంచాలని జపాన్ ప్రధానమంత్రి షిజో అబే కోరారు. ఇందుకోసం ఆయన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఓ వినతి చేశారు. మీ

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2017 (11:58 IST)
ప్రపంచ దేశాలను ధిక్కరించి ఇష్టానుసారంగా క్షిపణి ప్రయోగాలు చేస్తున్న ఉత్తర కొరియా మెడలు వంచాలని జపాన్ ప్రధానమంత్రి షిజో అబే కోరారు. ఇందుకోసం ఆయన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఓ వినతి చేశారు. మీరు అండగా ఉండండి.. మేం యుద్ధం చేస్తాం అంటూ కోరారు. 
 
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరకొరియా ప్రయోగించిన బాలిస్టిక్ మిస్సైల్‌తో తాము కలవరం చెందామన్నారు. అమెరికా ముందడుగు వేస్తే తాము తప్పకుండా అనుసరిస్తామన్నారు. చైనా, రష్యాలు కూడా ఈ విషయంలో తమ స్పందన తెలియజేయాలని కోరుతున్నారు.
 
ఉత్తర కొరియాకు అన్నివిధాల సహకరిస్తున్న చైనా ఉద్రిక్తతలను పెంచేందుకు శతవిధాలా కృషిచేస్తుందని విమర్శించారు. అయితే తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఉత్తరకొరియాపై దాడి చేయాల్సి వస్తే అమెరికాకు సహకరిస్తామన్నారు. 
 
ఒకవేళ యుద్ధం రావాలని ఉత్తరకొరియా, చైనాలు భావిస్తే వారికి ముందుగా టార్గెట్ అయ్యేది జపాన్, దక్షిణకొరియాలేనని అబే హెచ్చరించారు. అమెరికాను ఎదుర్కొనే శక్తి చైనాకు, ఉత్తరకొరియా లేదని తాను భావిస్తున్నానని తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments