Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాకు మీడియానే ప్రధాన శత్రువు : డోనాల్డ్ ట్రంప్

అమెరికాలు మీడియాపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికన్‌ ప్రజలకు మీడియానే శత్రువు అని ఆయన ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌లో ఉన్న తన క్లబ్‌ మార్‌-

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2017 (16:49 IST)
అమెరికాలు మీడియాపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికన్‌ ప్రజలకు మీడియానే శత్రువు అని ఆయన ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌లో ఉన్న తన క్లబ్‌ మార్‌-ఎ-లాగోకు వెళ్లిన వెంటనే ట్రంప్‌ ఈ ట్వీట్‌ చేశారు. ట్రంప్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వారాంతాల్లో అక్కడికే వెళ్తున్నారు. 
 
న్యూయార్క్‌ టైమ్స్‌, ఎన్‌బీసీ న్యూస్‌, ఏబీసీ, సీబీఎస్‌, సీఎన్‌ఎన్‌ మీడియా సంస్థలను ప్రస్తావిస్తూ ఫేక్‌ న్యూస్‌ మీడియా నాకు శత్రువులు కాదని, అవి అమెరికాకే శత్రువులని ట్వీట్‌ చేశారు. గత అమెరికా అధ్యక్షుల్లో కూడా చాలా మంది మీడియాను విమర్శించారు. కానీ ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలతో మీడియాపై విరుచుకుపడుతున్నారు. 
 
ప్రచారసమయం నుంచే ట్రంప్‌నకు, మీడియాకు మధ్య వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే. అప్పటినుంచే ఆయన మీడియాను విమర్శిస్తూనే ఉన్నారు. తన విజయాల పట్ల జర్నలిస్టులు సరైన గౌరవం ఇవ్వట్లేదని, తనకు వ్యతిరేకమైన అంశాలను మాత్రం చాలా పెద్దవి చూపుతున్నారని ట్రంప్‌ ఆరోపించారు. తన ప్రెస్‌కాన్ఫరెన్స్‌ కూడా సరైన కవరేజ్‌ ఇవ్వలేదన్నారు. నిజాయతీ లేని మీడియా అని విమర్శించారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments