లాక్‌డౌన్‌ సడలింపు వద్దు..సడలిస్తే తీవ్ర పరిణామాలు : డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

Webdunia
శనివారం, 2 మే 2020 (15:28 IST)
పలు దేశాల్లో లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తోన్న విషయంపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆయా దేశాలకు పలు హెచ్చరికలు చేసింది. 
 
కరోనా విజృంభణ అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక దూరం, లాక్‌డౌన్ వంటి చర్యలు‌ మాత్రమే కరోనాను కట్టడి చేస్తాయని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర విభాగ సీనియర్‌ అధికారి డాక్టర్ మైక్ ర్యాన్ తెలిపారు.
 
భారత్‌తో పాటు అమెరికా‌ లాంటి దేశాలు ఒకవేళ నిబంధనలను సడలిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటాయని చెప్పారు. 
 
కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించవద్దని హెచ్చరించారు. కాగా, కరోనా వైరస్‌ను‌ కట్టడి చేయడానికి ప్రస్తుతం పలు దేశాలు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని తెలిపారు.
 
ఇటువంటి సమయంలో వైరస్‌ ప్రభావం లేని ప్రాంతాల్లో నిబంధనలు ఎత్తివేడం వల్ల మళ్లీ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని చెప్పారు. 
 
ఆయా దేశాల్లో లాక్‌డౌన్ నిబంధనల్ని ఎత్తివేసే విషయంపై బాగా ఆలోచించుకోవాలని తెలిపారు. లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తున్న చాలా దేశాల్లో కేసులు ఒక్కసారిగా పెరిగాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల్లో అధికంగా ఉన్నాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళగా పుట్టినందుకు గర్వంగా ఉంది : జాన్వీ కపూర్

Sharva: సంక్రాంతికి శర్వా చిత్రం నారి నారి నడుమ మురారి గ్రాండ్ రిలీజ్

NTR, Balayya: ఒకప్పడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్ కి సినిమా రిలీజ్ కస్టాలు

అఖండ 2 కు లాబాలు వచ్చినా ప్రొడ్యూసర్స్ కు అనుకోని ఆటంకాలు

ప్రేమించి మోసం చేసేవాళ్ళకు పుట్టగతులుండవ్ : నటి ఇంద్రజ శాపనార్థాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments