Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెన్నెముక నుంచి విడిపోయిన తల.. అతికించిన వైద్యులు

Webdunia
శనివారం, 15 జులై 2023 (10:21 IST)
Doctors
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ బాలుడి ప్రాణాలను ఇజ్రాయెల్ వైద్యులు కాపాడారు. వెన్నెముక నుంచి విడిపోయిన తలను మళ్లీ జతపరిచి అద్భుతం సృష్టించారు. 
 
పూర్తి వివరాల్లోకి వెళితే.. జోర్డాన్ వ్యాలీకి చెందిన సులేమాన్ హసన్ (12) గతేడాది తన ఇంటి వద్ద సైకిల్ తొక్కుతుండగా కారు ఢీకొట్టింది. దీంతో, తల, వెన్నెముక కలిసే చోట లిగమెంట్లు తెగిపోవడంతో అంతర్గతంగా తల, వెన్నెముక వేరయ్యాయి. 
 
చికిత్స కోసం అతడిని జెరూసలేంలోని ఈన్ కెరెమ్ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు బాలుడి పరిస్థితి చూసి తొలుత షాకైపోయారు. అంతటితో ఆగకుండా బాలుడికి ఆపరేషన్ చేశారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న స్పెషలిస్టు వైద్యులు, నర్సులు కొన్ని గంటల పాటు కష్టపడి ఆపరేషన్ పూర్తి చేశారు. 
 
కొత్త కణాలు, నాడులను తిరిగి జోడించడంలో తాము పడ్డ కష్టం మాటల్లో వర్ణించలేమని వైద్యులు చెప్పారు. ఏడాది క్రితం ఈ ఆపరేషన్ జరగ్గా హసన్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. దీంతో, అతడిని డిశ్చార్జ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments