ఉద్యోగం లేదు.. రెచ్చిపోయిన ఉన్మాది.. కత్తితో పొడిచాడు.. ఆరుగురు మృతి

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (12:43 IST)
చైనాలో ఉద్యోగం లేదనే మనోవేదనతో ఓ యువకుడు ఉన్మాదిగా మారిపోయాడు. క‌త్తి ప‌ట్టి రోడ్డెక్కిన ఆ ఉన్మాది.. కనిపించిన వారిని కనిపించినట్టు పొడిచి పడేశాడు. దాదాపు 20 మందిపై దాడిచేయ‌గా.. ఆరుగురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. చైనాలోని హావ్‌నింగ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచ‌ల‌నం రేపింది. 
 
వివ‌రాళ్లోకెళితే.. చైనాలోని హావ్‌నింగ్ ప్రాంతం మెయిన్‌లాండ్‌కు చెందిన వూ(25) అనే యువకుడు ఉద్యోగ లేమితో ఖాళీగా ఉన్నాడు. దీంతో వూ మానసికంగా కుంగుబాటుకు గురయ్యాడు. దీనికితోడు కుటుంబంలో గొడవలు కూడా వూ ని మరింత వేదనకు గురిచేశాయి. దీంతో కోపంతో రగిలిపోయిన అతడు.. కత్తితో రోడ్డుపైకి వ‌చ్చి కనిపించిన వారిపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశాడు. 
 
ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 14 మంది తీవ్ర గాయాలపాల‌య్యారు. క్ష‌త‌గాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాయ‌ప‌డ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. ఘ‌ట‌న‌తో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments