Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంహెచ్370, ఎంహెచ్17 ప్రమాదాలు : మలేషియా ఎయిర్‌లైన్స్ పేరు మార్పు?

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (12:37 IST)
మలేషియా ఎయిర్‌లైన్ సంస్థ పేరు మార్చాలని ఆ దేశ ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేస్తోంది. ఆ సంస్థకు చెందిన ఎంహెచ్ 370, ఎంహెచ్ 17 ప్రమాదాల నేపథ్యంలో మలేషియా ఎయిర్ లైన్స్ విమానం పేరు మార్చుకోవాలన్న ఆలోచనలలో ఉన్నట్టు వార్తా కథనాలు వస్తున్నాయి. 
 
ఈ యేడాది కేవలం ఆరు నెలల వ్యవధిలోనే మలేషియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు విమానాలు కూలిపోయాయి. ఈ నేపథ్యంలో సంస్థ కోల్పోయిన ప్రతిష్టను తిరిగి నిర్మించే పనిలో పడింది. ఇందులో భాగంగా మలేషియా ఎయిర్ లైన్స్ పేరును మార్చనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జరిగిన నష్టాన్ని పూడ్చుకుని పునర్నిర్మించుకోవాలని చూస్తున్నట్లు యూకె టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది. 
 
ఎయిర్ లైన్స్‌లో మెజారిటీ శాతం ప్రభుత్వానిదే. అయితే, సంస్థలో కొత్త పెట్టుడిదారులను ఎదురుచూస్తోంది. అంతేకాక సంస్థ లాభదాయకత కోసం అవుట్ సోర్సింగ్‌ను విస్తరించాలనుకుంటోంది. ఆరు నెలల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో 537 మంది మరణించారని పత్రిక వివరించింది. ఈ ఏడాది మార్చిలో ఎంహెచ్ 370 విమానం గల్లంతయింది. ఆ తర్వాత ఎంహెచ్ 17 ప్రమాదంలో 298 మంది చనిపోయిన విషయం తెల్సిందే. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments