Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్లాదిమిర్ పుతిన్‌కు గుండెపోటా? రష్యా క్లారిటీ ఇచ్చిందా?

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2023 (23:35 IST)
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తీవ్రమైన గుండెపోటు వచ్చి మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో పుతిన్ అనారోగ్యం గురించి కథనాలు ఎక్కువయ్యాయి. పుతిన్ కొద్దిరోజులుగా తీవ్రమైన, నయంకాని వ్యాధితో బాధపడుతున్నారని, కొద్దిరోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, శస్త్రచికిత్స చేయించుకున్నారని పుతిన్ ఆరోగ్యంపై పలు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే. వీటిని రష్యా ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది.
 
కానీ తాజాగా మరో కథనం వైరల్ అవుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆదివారం ఉదయం గుండెపోటు వచ్చిందని, ఆయన తన గదిలోని మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉన్నారని, వెంటనే వ్యక్తిగత వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించి ప్రాణాలను కాపాడారని ఆ వార్త సారాంశం. 
 
అందుకే పుతిన్ తన షెడ్యూల్ ఈవెంట్‌లను రద్దు చేసుకున్నట్లు వారు వివరించారు. అయితే ఈ వార్తలను రష్యా ఖండించింది. పుతిన్ గురించి వందలాది పుకార్లలో ఇది ఒకటి. ఆ వార్త పూర్తిగా అబద్ధమని, నిరాధారమని స్పష్టం చేశారు. పుతిన్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ బుధవారం స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాప్ 250 భారతీయ చిత్రాల జాబితాను ప్రకటించిన ఐఎండీబీ

సినిమా విడుదలయ్యాక వారం తర్వాత రివ్యూలపై రచ్చ?

ముంబై నటి జత్వానీ కేసు : ఐపీఎస్‌ల ముందస్తు బెయిల్ పిటిషన్లు

నాటి సినిమా హాలులు నేటి మల్లీప్లెక్స్ ల కబుర్లు

భేషుగ్గా రజనీకాంత్ ఆరోగ్యం : అపోలో ఆస్పత్రి హెల్త్ బులిటెన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

కుప్పింటాకా.. మజాకా.. మహిళలకు ఇది దివ్యౌషధం..

తర్వాతి కథనం
Show comments