Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాకిస్థాన్ మధ్య ట్రంప్ సయోధ్య.. త్వరలోనే శుభవార్త వింటారు..

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (18:33 IST)
భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంపై ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు స్పందిస్తున్నాయి. అయితే అమెరికా మాత్రం ఇరు దేశాల్లో జరిగుతున్న పరిణామాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. అయితే యుద్ధం జరగకుండా ఆపాలనే యోచనలో అమెరికా ఉన్నట్లు సమాచారం.
 
ఈ విషయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం వియత్నాంలో ఉన్న ట్రంప్ ఈ విషయంపై స్పందిస్తూ ఇరు దేశాలతో ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించానని అతి త్వరలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.
 
అయితే ఇరు దేశాలు ఈ సమస్య పట్ల శాంతియుతంగా ఆలోచించి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని కోరారు. సరిహద్దుల్లో శాంతి స్థాపనకు తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పిన ఆయన త్వరలోనే ఇరు దేశాల నుండి శుభవార్త వింటామని ఆశాభావం వ్యక్తం చేసారు. 
 
మరోవైపు పాకిస్థాన్ ఆర్మీ అదుపులో ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్‌ను కూడా విడిపించేందుకు ట్రంప్ చొరవ తీసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments