Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ నెత్తిన చైనా రాకెట్ "లాంగ్ మార్చ్ 5బి".. విధ్వంసమేనా??

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (08:33 IST)
నింగిలో అదుపు తప్పి భూమిపైకి దూసుకొస్తున్న చైనా రాకెట్... ఇపుడు ఢిల్లీ నెత్తినపడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చైనా రాకెట్ పేరు లాంగ్ మార్చ్ 5బి. దీనిపైనే ప్రస్తుతం యావత్ ప్రపంచం దృష్టి కేంద్రీకృతమైవుంది. ఇది మరో 48 గంటల్లో (మే 8 నాటికి) భూమిని తాకొచ్చని అమెరికా రక్షణ శాఖ ప్రకటించారు. అయితే, ఈ రాకెట్ ఏ దేశంలో పడుతుందనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. 
 
ఈ నేపథ్యంలో అమెరికాలోని హార్వర్డ్‌ స్మితోజియన్‌ ఆస్ట్రోఫిజికల్‌ అబ్జర్వేటరీ ఖగోళ శాస్త్రజ్ఞుడు జొనాథన్‌ మెక్‌డోవెల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా రాకెట్‌.. భారత రాజధాని ఢిల్లీపైనా పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. బీజింగ్‌, ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం, బ్రెజిల్‌లోని రియో డీ జెనీరియో నగరాలపై పడే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని చెప్పుకొచ్చారు. 
 
ప్రస్తుతం ఆ రాకెట్‌ సెకనుకు 4 మైళ్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోందని, భూమధ్యరేఖకు ఉత్తర, దక్షిణ భాగాలలో 41 డిగ్రీల మధ్య ఉండే ప్రాంతాల్లో ఎక్కడైనా లాంగ్‌ మార్చ్‌ 5బీ కుప్పకూలొచ్చన్నారు. అయితే దాన్ని అదుపులోకి తీసుకొని, నిర్జన ప్రదేశాల వైపు మళ్లించే ప్రయత్నాల్లో చైనా నిమగ్నమైవుండొచ్చని చెప్పుకొచ్చారు. 
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments