Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రవాస భారతీయుడి హత్య కేసులో నిందితుడికి ఉరి

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (09:15 IST)
ఓ ప్రవాస భారతీయుడిని చంపిన కేసులో సింగపూర్ కోర్టు నిందితుడికి కఠిశిక్షే విధించింది. చోరీ చేసిందే కాకుండా హత్య చేసినందుకుగానూ ఏకంగా ఉరిశిక్ష విధించింది. అతనికి సహకరించినందుకు మరొకరికి జీవిత ఖైదు విధించింది. వివరాలిలా ఉన్నాయి. 
 
భారత్కు చెందిన షణ్ముఖనాథన్ (41) సింగపూర్లో నిర్మాణ రంగంలో పని చేస్తున్నాడు. అయితే 2010లో మే 29 అర్థరాత్రి షణ్ముఖ్ నివాసంలో  మలేసియాకు చెందిన గారింగ్, టోని లంబాలు చోరీకి యత్నించారు. ఆ సమయంలో షణ్ముఖ్తోపాటు అతని రూమ్లోని ముగ్గురు ప్రతిఘటించారు. 
 
దీంతో ఆగ్రహించిన గారింగ్ షణ్ముఖ్ను హత్య చేశాడు. మిగతా వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం గారింగ్తోపాటు లంబా చోరీ చేసి పరారైయ్యారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసుపై కోర్టులో వాదోపవాదాలు ఇటీవలే పూర్తయ్యాయి. గారింగ్, లంబాలను నేరస్తులుగా భావించిన హైకోర్టు న్యాయమూర్తి శిక్షను ఖరారు చేసింది. గారింగ్ కు ఉరి, లంబాకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. 
 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments