Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోయాడు అనుకుంటే.. మార్చురీకి వెళ్తూ.. ఊపిరి పీల్చుకున్నాడు..!

Webdunia
మంగళవారం, 26 మే 2015 (18:19 IST)
అందరూ చనిపోయాడు అనుకున్నారు. కానీ మార్చురీకి తరలిస్తే ఊపిరి పీల్చుకున్నాడు. ఈ ఘటన, అమెరికాలోని విస్కాన్సిన్ స్టేట్ మిల్ మాకీ నగరంలో చోటుచేసుకుంది. 46 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి తన అపార్ట్ మెంట్‌లో స్పృహ తప్పి పడిపోయాడు. ఆ స్థితిలో ఉన్న అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే చనిపోయాడని తేల్చి చెప్పారు. శరీరం చల్లబడి, గుండె కొట్టుకోకపోవడంతో చనిపోయాడనే అందరూ భావించారు. 
 
అనంతరం, అతడిని మార్చురీకి తరలిస్తుండగా... ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాడు. దీంతో మార్చురీకి తరలిస్తున్నవారు అవాక్కయ్యారు. అంతేకాదు, చనిపోయాడనుకున్న వ్యక్తి కుడి చెయ్యి, కుడి కాలు కూడా కదలడం ప్రారంభమైంది. దీంతో, అతడిని మళ్లీ వైద్యుల వద్దకు తరలించారు. ఆ తర్వాత వైద్యులు మాట్లాడుతూ, అతడు చాలా అరుదైన కోమాలోకి వెళ్లి, తిరిగి స్పృహలోకి వచ్చాడని వెల్లడించారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments