Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెచ్-1బీ వీసాదారులకు ఊరట.. ఊపిరిపీల్చుకున్న భారతీయులు

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (08:36 IST)
ప్రవాస భారతీయులుకు అమెరికా ఓ శుభవార్త చెప్పింది. హెచ్-1బీ వీసా గడువు ముగిసిపోయిన వారంతా తెగ హైరానా పడుతూ వచ్చారు. ఇలాంటి వారికి కరోనా కష్టాల్లో ఊరటనిచ్చే వార్తను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఓ ప్రకటన చేసింది. వీరి వీసా గడువు పొడిగించేందుకు త్వరలోనే దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించింది. హెచ్-1 బీ వీసా గడువు ముగిసినా కరోనా మహమ్మారి కారణంగా ఎక్కడికీ వెళ్లలేక ఇక్కడే ఉండిపోయిన పరిస్థితిని తాము గుర్తించామని చెప్పింది. 
 
ఈ వీసాపై ఉన్న వారు గడువు పొడిగించాలని కోరుతూ సరైన సమయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం హెచ్-1బీ వీసాపై 240 రోజుల గడువుదానంతట అదే లభిస్తుందని తెలిపింది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో హెచ్-1బీ వీసాపై అక్కడికి వెళ్లి చిక్కుకుపోయిన భారతీయులకు ఊరట లభించినుంది. 
 
కాగా, వీసా గడువు ముగిసినప్పటికీ.. కరోనా మహమ్మారి కారణంగా అనేకమంది భారతీయులు విదేశాల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. హెచ్-1బీ వీసాపై అమెరికా వెళ్లిన భారతీయుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇలాంటి తరుణంలో వారికి ఊరట ఇచ్చే మాటను యూఎస్ ప్రభుత్వం చెప్పింది. 
 
కరోనా కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు కావడంతో చాలా మంది హెచ్- 1బీ వీసాదారులు అమెరికాలోనే ఉండిపోవాల్సి వచ్చిందని, అందులో కొందరి వీసా గడువు త్వరలోనే ముగియనున్న కారణంగా ఆందోళన చెందుతున్నారు. 

సంబంధిత వార్తలు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

తర్వాతి కథనం
Show comments