Webdunia - Bharat's app for daily news and videos

Install App

మక్కా మసీదు మూసివేతకు నిర్ణయం?

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (08:59 IST)
సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లిం సౌదరులు తమ జీవితకాలంలో ఒక్కసారైనా వెళ్లివచ్చే పవిత్ర మక్కా మసీదును మూసివేయనున్నారు. అదీ కూడా పవిత్ర మాసంగా భావించే రంజాన్ నెలలోనే ఈ మసీదును మూసివేయనున్నారు. ఈ నిర్ణయంతో పవిత్ర మక్కాలోని అల్ హరం, అల్ నబవీ మసీదులను మూతపడనున్నాయి. 
 
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళించింది. ఈ వైరస్ బారినపడిన దేశాల్లో సౌదీ అరేబియా కూడా ఉంది. ఈ దేశంలో కూడా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్ కూడా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంజాన్ మాసంలో మసీదులు తెరిచివుంచితే కరోనా మహమ్మారి మరింతగా వ్యాపించే అవకాశం ఉందని భావించిన సౌదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. 
 
వాస్తవానికి రంజాన్ మాసంలో ఉపవాసాల సందర్భంగా ప్రపంచదేశాల నుంచి లక్షలాది మంది మక్కాకు, హజ్ యాత్రకూ వచ్చి, ఇక్కడి మసీదుల్లో ప్రార్థనలు చేస్తుంటారు. ఈ సంవత్సరం ఎటువంటి ప్రార్థనలకూ అనుమతి ఇవ్వబోమని మసీదుల ప్రెసిడెంట్ డాక్టర్ షేఖ్ అబ్దుల్ రహమాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌదీస్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
 
తరావీ నమాజ్‌లను, రంజాన్ ఈద్ నమాజ్‌ను ముస్లింలంతా ఇళ్లలోనే చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కాగా, ఇప్పటివరకూ సుమారు 10 వేల మందికి పైగా సౌదీ అరేబియాలో కరోనా బారిన పడగా, వారిలో 100 మందికి పైగా మరణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments