Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో కరోనా వైరస్ విజృంభణ : అష్టదిగ్భంధనంలో నగరాలు (video)

Webdunia
శనివారం, 25 జనవరి 2020 (10:58 IST)
చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ వైరస్ బారినపడిన చనిపోయిన రోగుల సంఖ్య 26కు చేరింది. మరో 41 మిలియన్ల మందికి ఈ వైరస్ సోకినట్టు చైనా ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యంత ప్రమాదకారిగా మారిన ఈ వైరస్ బారిన మరికొంతమంది ప్రజలు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులోభాగంగా అష్టదిగ్బంధనం చేసింది. ఈ అష్టదిగ్బంధనంలోకి 13 నగరాలు వచ్చాయి. అంటే, ఆయా నగరాల్లోని ప్రజా రవాణా వ్యవస్థను మొత్తం నిలిపివేసింది. దీంతో నాలుగు కోట్ల మంది ప్రజలు ఎటూ కదల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
మరోవైపు, కరోనా వైరస్ కోరలు చాస్తుండడంతో దేశంలో ఎక్కడా కొత్త సంవత్సర వేడుకల జాడ కనిపించలేదు. చైనా కొత్త సంవత్సరమైన మూషిక ఏడాది శనివారం నుంచే ప్రారంభమైంది. చైనాలో ఇది అతిపెద్ద పండుగ అయినప్పటికీ ఎక్కడా సందడి లేదు. వ్యాధి మరింత విస్తరించకుండా చేపట్టే చర్యల కోసం ప్రభుత్వం వంద కోట్ల యువాన్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1008 కోట్లు కేటాయించింది. కరోనా వైరస్ బాధితులకు చికిత్స కోసం సైన్యంలోని వైద్యాధికారుల్ని రంగంలోకి దించారు. ఇక, చైనాలోని భారత రాయబార కార్యాలయంలో ఆదివారం జరగాల్సిన భారత రిపబ్లిక్ డే వేడుకలను రద్దు చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

కార్తిక్ రాజు హీరోగా అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే చిత్రం ప్రారంభమైంది

మెగాస్టార్ చిరంజీవి 157 చిత్రం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments