Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగుల పనితీరు బాగలేదనీ.. బెత్తంతో చితకబాదిన బ్యాంకు ప్రెసిడెంట్

ఉద్యోగుల‌ు సరిగ్గా పనిచేయకపోతే ఉన్నతాధికారులు తిట్టడమే లేక పని నుంచి తీసెయ్యడమే చేస్తుంటారు. కానీ ఇక్కడ ఒక బాస్ ఉద్యోగులు సరిగ్గా పనిచేయలేదని స్కూల్ పిల్ల‌వాడిని కొట్టిన‌ట్లుగా కొట్టాడు.

Webdunia
గురువారం, 23 జూన్ 2016 (08:44 IST)
ఉద్యోగుల‌ు సరిగ్గా పనిచేయకపోతే ఉన్నతాధికారులు తిట్టడమే లేక పని నుంచి తీసెయ్యడమే చేస్తుంటారు. కానీ ఇక్కడ ఒక బాస్ ఉద్యోగులు సరిగ్గా పనిచేయలేదని స్కూల్ పిల్ల‌వాడిని కొట్టిన‌ట్లుగా కొట్టాడు. ప‌నితీరు స‌రిగాలేద‌ని ఓ బ్యాంకు అధ్యక్షుడు శిక్ష‌ణ‌లో ఉన్న ఉద్యోగులను బెత్తంతో చిత‌క బాదాడు. ఈ ఉదంతం ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విస్మయంగొలిపే ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. 
 
చాంగ్చి రూరల్ కమర్షియల్ బ్యాంక్ ఉద్యోగుల పనితీరును మెరుగుపర్చేందుకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటుచేసింది. ఇందులో 8 మంది ఉద్యోగులు పనితీరు మెరుగుపరుచుకోలేదంటూ అందరూ చూస్తుండగానే స్టేజీపైనే బ్యాంక్ ప్రెసిడెంట్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆ వెంటనే ఓ బెత్తం తీసుకుని ఆ 8 మంది సిబ్బందిని చావబాదాడు. ఇందులో ఆడ, మ‌గ అన్న తేడాను కూడా మ‌రిచిన ఆ బ్యాంకు అధ్య‌క్షుడు చేసిన నిర్వాహకం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. 
 
ఈ విషయాన్ని ''పీపుల్స్ డైలీ'' వీడియోగా తీసి బయటపెట్టింది. ఇలా చేయడానిరి కారణం కూడా లేకపోలేదు... పబ్లిక్‌గా సిబ్బందిని అవమానిస్తే పనితీరు మెరుగుపరుచుకుంటారని బ్యాంక్ అధ్యక్షుడు భావించి ఇలా చేశారట. అయితే ఈ ఘ‌ట‌న‌పై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీంతో ఆ బ్యాంకు అధ్య‌క్షునిపై సస్పెన్ష‌న్ వేటు ప‌డింది. ఆయన పని గోవిందా గోవిందా....! 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments