Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనవంతులను ఎలా ప్రేమలో దించి పెళ్లాడాలో మహిళలకు తర్ఫీదు!!

వరుణ్
ఆదివారం, 14 జులై 2024 (18:47 IST)
ధనవంతులను ఎలా ప్రేమించాలి, వారిని ఎలా బుట్టలో వేసుకోవాలన్న అంశంపై మహిళలకు మరో మహిళ శిక్షణ ఇస్తుంది. తద్వారా కోట్లాది రూపాయలను అర్జిస్తుంది. యువతులకు, మహిళ ఇలాంటి వివాదాస్పద ప్రేమ పాఠాలు నేర్పిస్తూ ఈ ఇన్సుఫ్లుయెన్సర్ చైనాలో లవ్ గురువుగా పాప్యులారిటీ సాధించింది. తద్వారా ఒక యేడాదికి ఏకంగా రూ.168 కోట్లు సంపాదిస్తోంది.
 
చైనా సోషల్ మీడియాలో కూకూగా చిరపరిచితమైన ఈమె పేరు లీ చువాంకూ. ఆమె దృష్టిలో పెళ్లంటే ఆర్థిక లక్ష్యాలు. డబ్బున్న మగాళ్లను మహిళలు బుట్టలో వేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని సలహా ఇస్తుంది. ఇందుకోసం లైవ్ స్ట్రీమ్ సలహాలు ఇస్తుంది. అయితే, ఇందుకోసం ఆమె ఒక్కొక్కరి నుంచి దాదాపు రూ.13 వేలు వసూలు చేస్తుంది. ఇక ఆన్‌లైన్‌లో వ్యాలుయెబుల్ రిలేషన్ షిప్ పాఠాల ఖరీదు రూ.43 వేలు. ఇక వ్యక్తిగతంగా వచ్చి సలహాలు తీసుకోవాలంటే రూ.1.16 లక్షలు ముట్టచెప్పాల్సిందే. ఇలా ఒక్కో సందర్భానికి ఒక్కో రేటు చొప్పున వసూలు చేస్తూ రెండు చేతులా దండిగా సంపాదిస్తోంది.
 
స్త్రీ పురుషుల సంబంధాన్ని డబ్బుమయంగా మార్చేసిన ఆమెను ఎప్పుడో సోషల్ మీడియాలో నిషేధించారు. అయితే, వివిధ మార్గాల్లో తన ఫాలోవర్లకు అందుబాటులో ఉంటూ సంపాదన కొనసాగిస్తోంది. ఆమెపై ప్రజల్లో కూడా భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. డబ్బున్న మగాళ్లను ఆకర్షించేందుకు మహిళలు తమని తాము లైంగిక వస్తువులుగా మార్చుకునేలా ఆమె ప్రోత్సహిస్తోందని విమర్శిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం