Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ బాస్‌కు ముద్దు పెట్టకపోతే.. ఆఫీసులో పని చేయలేం..కిస్ బాస్‌ను వీడియోలో చూడండి..

ఆఫీసుకు వచ్చీ రాగానే బాస్‌కు ముద్దు పెట్టకపోతే.. అక్కడ పనిచేయలేం. ఆఫీసులోకి ఎంత హడావుడిగా వచ్చినా కూల్‌గా బాస్‌కు ముద్దివ్వాల్సిందే. ఎక్కడో తెలుసా? చైనాలో. వివరాల్లోకి వెళితే.. చైనాలోని టాంగ్‌జ్యు జిల

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2016 (11:12 IST)
ఆఫీసుకు వచ్చీ రాగానే బాస్‌కు ముద్దు పెట్టకపోతే.. అక్కడ పనిచేయలేం. ఆఫీసులోకి ఎంత హడావుడిగా వచ్చినా కూల్‌గా బాస్‌కు ముద్దివ్వాల్సిందే. ఎక్కడో తెలుసా? చైనాలో. వివరాల్లోకి వెళితే.. చైనాలోని టాంగ్‌జ్యు జిల్లాలో ఉన్న ఓ కంపెనీలో పనిచేయాలంటే అమ్మాయిలు రోజూ ఆఫీస్‌కు రాగానే బాస్‌కు ముద్దు పెట్టాల్సిందే. అలా ముద్దు పెడితేనే ఆఫీస్‌లో పని ఉంటుంది. లేకపోతే జాబ్‌కు రిజైన్ చేసి వెళ్లాల్సిందే. 
 
పైగా ఆ ఆఫీస్‌లో సగం మందికి పైగా అమ్మాయిలే ఉంటారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి 9.30గంటల మధ్యలో అమ్మాయిలంతా బాస్‌కు ముద్దు పెట్టేందుకు క్యూ కట్టాల్సిందే. లేకపోతే బాస్ ఊరుకోడు. అలా ముద్దు పెట్టడం కుదరదన్న పాపానికి ఇద్దరు మహిళా ఉద్యోగులు ఇప్పటికే రాజీనామా చేసేసి ఇంటికెళ్లిపోయారు. ఈ ముద్దుల వ్యవహారాన్ని.. బాస్ బాగోతాన్ని పీపుల్స్ డైలీ అనే ఓ మీడియా సంస్థ బట్టబయలు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది. 
 
ఇలా రోజూ ముద్దెట్టుకుంటే.. ఆఫీసులో పనిచేసే మహిళా కొలీగ్స్‌తో మంచి సంబంధాలు పెరుగుతాయని బాస్ చెప్తున్నాడు. ఇలా చేస్తే చేపకు నీటికి ఉన్న సంబంధంలా మహిళా ఉద్యోగులతో తన సంబంధాలుంటాయని బాస్ అంటున్నాడు. ముద్దులే కాదు.. మహిళా ఉద్యోగులతో ఈ బాస్ తరచూ చాట్ చేస్తాడట.
 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments