Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాకు చైనా వార్నింగ్... భారత్ - చైనా సరిహద్దు సమస్యపై తలదూరిస్తే అంతే...

అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న భారత్-చైనా సరిహద్దు ప్రాంతాన్ని అమెరికా దౌత్యవేత్త రిచర్డ్ వర్మ సందర్శించడాన్ని తప్పుబట్టింది. వివాదాస్పద, సున్నితమైన సరిహద్దు సమస్యలో అమెరికా తలదూర్చితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చర

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (17:04 IST)
అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న భారత్-చైనా సరిహద్దు ప్రాంతాన్ని అమెరికా దౌత్యవేత్త రిచర్డ్ వర్మ సందర్శించడాన్ని తప్పుబట్టింది. వివాదాస్పద, సున్నితమైన సరిహద్దు సమస్యలో అమెరికా తలదూర్చితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. అసలు అక్కడ పర్యటించాల్సిన అవసరం మీకెందుకు అంటూ ప్రశ్నించింది. అమెరికా చేష్టల వల్ల న్యూఢిల్లీ-బీజింగ్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని వెల్లడించింది. 
 
సమస్యను మరింత జఠిలం చేయాలనుకుంటే ఇలాంటి చర్యలకు పాల్పడండి కానీ శాంతియుత పరిష్కారం కావాలనుకుంటే మాత్రం మీదారిని మీరు వెళ్లండి అంటూ తెలిపింది. తమ రెండు దేశాల మధ్య తలెత్తిన సమస్యలను భారత్-చైనాలు శాంతియుతంగా పరిష్కరించుకోగలవన్న విశ్వాసం తమకు ఉన్నదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లు కాంగ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. సరిహద్ద సమస్యల విషయంలో తమ మధ్య మూడో దేశం జోక్యం అవసరం లేదని తెలిపింది. అలా జోక్యం చేసుకుంటే చివరకు చైనా-భారత్ ప్రజలు అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వెల్లడించింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments