Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ న్యూస్‌ యాంకర్‌ నిబద్ధతపై చైనా ప్రశంసల వర్షం

భర్త మరణ వార్తను గుండె దిటువు చేసుకుని చదివిన భారతీయ టీవీ యాంకర్ సుప్రీత్ కౌర్ మనో ధైర్యాన్ని చైనా వేనోళ్ల కొనియాడింది. విధి నిర్వహణ పట్ల ఆమెకు ఉన్న గౌరవం ప్రశంసనీయమని ఐబీసీ-24 చానెల్‌ యాంకర్‌ సుప్రీత్‌ కౌర్‌ను ఉద్దేశించి చైనా మీడియాకు చెందిన గ్లోబల

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (08:14 IST)
భర్త మరణ వార్తను గుండె దిటువు చేసుకుని చదివిన భారతీయ టీవీ యాంకర్ సుప్రీత్ కౌర్ మనో  ధైర్యాన్ని చైనా వేనోళ్ల కొనియాడింది. విధి నిర్వహణ పట్ల ఆమెకు ఉన్న గౌరవం ప్రశంసనీయమని ఐబీసీ-24 చానెల్‌ యాంకర్‌ సుప్రీత్‌ కౌర్‌ను ఉద్దేశించి చైనా మీడియాకు చెందిన గ్లోబల్ టైమ్స్‌, పీపుల్స్‌ డైలీ, చైనా డైలీ, షింగ్జువా న్యూస్‌లు వ్యాఖ్యానించాయి. ఆ దేశానికి చెందిన గ్లోబల్ టైమ్స్‌, పీపుల్స్‌ డైలీ, చైనా డైలీ, షింగ్జువా న్యూస్‌లు భర్త మరణ వార్తను గుండె దిటువు చేసుకుని చదివిన ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నాయి.
 
 
చత్తీస్‌గడ్‌లో ఐబీసీ-24 అనే ప్రయివేట్ చానల్ న్యూస్ రీడర్ సుప్రీత్ కౌర్ శనివారం ఉదయం వార్తల్లో తన భర్త ప్రమాదంలో మరణించిన వార్తనే చదవాల్సి ఉంటుందని ఊహించలేకపోయంది. ఉదయం బ్రేకింగ్ న్యూస్‌లో వార్తను చదువుతున్నప్పుడు గానీ రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోయిన విషయం తెలియలేదు. మహాసముద్ జిల్లాలో పితారా ప్రాంతంలో రెనాల్ట్ డస్టర్ కారు ప్రమాదంలో చిక్కుకుందని రిపోర్టర్ చెబుతున్నప్పడే ఆ ప్రమాదంలో చనిపోయింది తన భర్తే అని గ్రహించిన సుప్రీత్ షాక్‌కు గురవుతూనే  లైవ్‌లో ఆ వార్తను ఎలాంటి ఉద్వేగానికి లోనవకుండానే నిర్భావంతో చదివింది. 
 
రేనాల్ట్ డస్టర్ కారులో ప్రయాణిస్తున్న అయిదుగురిలో ముగ్గురు చనిపోయారని వారిని ఇంకా గుర్తుపట్టలేదని రిపోర్టర్ లైవ్‌లో చెబుతున్నప్పుడు ఆ ప్రమాదంలో చనిపోయింది తన భర్తే కావచ్చని ఆమె ఊహించింది. ఎందుకంటే అదే రూట్‌లో తన భర్త ఆ సమయంలో ప్రయాణిస్తున్నట్లు ఆమెకు తెలుసు. కానీ ఎలాంటి బాధాసూచనను కనిపించనివ్వకుండా ఆ వార్తను అలాగే చదివింది. బులెటిన్‌ పూర్తి చేసిన తర్వాత బోరున విలపించింది. బంధువులకు ఫోన్‌ చేసి జరిగిన ధారుణాన్ని తెలుసుకొంది.
 
కాగా, కౌర్‌ వార్తలు చదువుతుండగా బులిటెన్‌ మధ్యలో కారు ప్రమాదం గురించి బ్రేకింగ్‌ న్యూస్‌ వచ్చింది. ఆ కారు ప్రమాదంలో తన భర్త మృతి చెందిన విషయం ఆమెకు తెలిసినప్పటికీ బాధను బయటకు వ్యక్తం చేయకుండా బులిటెన్‌ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే.
 
ఇందుకు సంబంధించిన బులిటెన్‌ వీడియో సోషల్‌ మీడియా వైరల్‌ అయింది. పలువురు ఆమెకు వృత్తి పట్ల ఉన్న శ్రద్ధను కొనియాడారు. తాజాగా ఆ లిస్టులో చైనా మీడియా కూడా చేరింది. కౌర్‌ వార్తలు చదివిన వీడియోను చైనా మీడియా తమ ట్విట్టర్‌ అకౌంట్లలో పోస్టు చేసింది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments