Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాకు సుఖోయ్ జీ-5 యుద్ధ విమానాలు... భారత్‌పై దాడికేనా?

భారత్ శత్రుదేశం చైనాకు రష్యా ఉన్నట్టుండి సుఖోయ్-35 యుద్ధ విమానాలను సరఫరా చేసింది. ఐదోతరం (జీ-5)కు చెందిన ఈ సుఖోయ్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం రష్యా - చైనా దేశాల మధ్య రెండేళ్ళ కిందటే ఒప్పందం జరిగింది.

Webdunia
సోమవారం, 2 జనవరి 2017 (14:37 IST)
భారత్ శత్రుదేశం చైనాకు రష్యా ఉన్నట్టుండి సుఖోయ్-35 యుద్ధ విమానాలను సరఫరా చేసింది. ఐదోతరం (జీ-5)కు చెందిన ఈ సుఖోయ్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం రష్యా - చైనా దేశాల మధ్య రెండేళ్ళ కిందటే ఒప్పందం జరిగింది. అప్పటినుంచి ఈ విమానాలను అందించడంలో తీవ్ర జాప్యం చేసిన రష్యా.. ఇపుడు ఆకస్మికంగా నాలుగు యుద్ధ విమానాలను అందించింది. ఈ నిర్ణయం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనివల్ల భారత్ - చైనాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనవచ్చని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఈ యుద్ధ విమానాల కోసం చైనా గత రెండేళ్లుగా నిరీక్షించింది. కానీ రష్యా నుంచి స్పందన లేకపోవడంతో చైనా సొంతంగా తయారు చేసుకోవడంపై దృష్టిసారించింది. ఇప్పటికే అక్కడి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ‘జె-20’ పేరిట కొత్త విమానాన్ని ఆవిష్కరించింది కూడా. దీంతో అక్కడి మార్కెట్లో సుఖోయ్ విమానాలకు విలువ తగ్గుతుందన్న ఆందోళనతో రష్యా చకచకా డీల్ ఓకే చేసినట్టు చెబుతున్నారు. 
 
కాగా భారత వైమానిక దళం వద్ద ఉన్న సుఖోయ్-30 విమానాలకంటే సుఖోయ్-35 రకానికి చెందిన విమానాలు మరింత సామర్థ్యంతో పనిచేస్తాయి. అత్యాధునికమైనవి కూడా. ఈ విమానాలపై చైనా కూడా ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. రష్యా నుంచి డిసెంబర్ 25న యుద్ధవిమానాలు అందినట్టు చైనా ఆర్మీ ప్రకటించింది. తాజా పరిణామాలతో మళ్లీ చైనా, రష్యాల మధ్య సంబంధాలు బలపడతాయని, అదేసమయంలో భారత్ - చైనాల మధ్య సంబంధాలు ఉద్రిక్తతలకు దారితీయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments