Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో పెట్రోల్ - డీజిల్ కార్లు బంద్... ఇకపై విద్యుత్ కార్లు

చైనాలో పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్లు బంద్ కానున్నాయి. వీటి స్థానంలో విద్యుత్, గ్యాస్‌తో నడిచే కార్లు రోడ్లపై కనిపించనున్నాయి. ఇదే అంశంపై ఆ దేశ పరిశ్రమలు, ఐటీ శాఖ ఉప మంత్రి క్జిన్ గౌబిన్ మాట్లాడుతూ,

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2017 (09:01 IST)
చైనాలో పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్లు బంద్ కానున్నాయి. వీటి స్థానంలో విద్యుత్, గ్యాస్‌తో నడిచే కార్లు రోడ్లపై కనిపించనున్నాయి. ఇదే అంశంపై ఆ దేశ పరిశ్రమలు, ఐటీ శాఖ ఉప మంత్రి క్జిన్ గౌబిన్ మాట్లాడుతూ, దేశంలో శిలాజ ఇంధనాలపై ఆధారపడి నడిచే కార్ల ఉత్పత్తిని నిలిపివేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఓ పాలసీని రూపొందిస్తున్నామన్నారు. 
 
ప్రత్యామ్నాయ మార్గాలపై పరిశోధనలు కొనసాగుతాయన్నారు. విచ్చలవిడిగా పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు, ట్రాఫిక్‌ను తగ్గించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో మాత్రం కచ్చితంగా చెప్పలేదు. 
 
ఇప్పటికే రాజధాని బీజింగ్‌తోపాటు షాంఘై వంటి పలు మహానగరాల్లో కార్ల అమ్మకాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వాయు కాలుష్యం విపరీతంగా పెరగిపోవడంతో అత్యవసరంగా ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించింది. 
 
సరి-బేసి వంటి విధానాలు అమలు చేస్తూ వాహనాలు ఎక్కువగా రోడ్లపైకి ఎక్కకుండా చర్యలు తీసుకుంది. అయినా ఆశించిన మేర ఫలితాలు కనిపించకపోవడంతో ఇప్పుడు ఏకంగా పెట్రోల్, డీజిల్ కార్ల ఉత్పత్తిపై నిషేధం విధించాలని ఆలోచిస్తున్నది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments