Webdunia - Bharat's app for daily news and videos

Install App

తోకముడుచుకుని వెనక్కి పోతారా... యుద్ధం చేస్తారా? భారత్‌కు చైనా వార్నింగ్

సిక్కిం భూభాగంలో ఉన్న డోక్లాం ప్రాంతం నుంచి భారత సైన్యం తక్షణం వెనక్కి పోవాలంటూ చైనా హెచ్చరించింది. అలాకానీపక్షంలో యుద్ధానికి సిద్ధమని చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గ్లోబల్‌టైమ్స్ పత్రికలో ఈ మేరకు ఓ

Webdunia
బుధవారం, 19 జులై 2017 (15:49 IST)
సిక్కిం భూభాగంలో ఉన్న డోక్లాం ప్రాంతం నుంచి భారత సైన్యం తక్షణం వెనక్కి పోవాలంటూ చైనా హెచ్చరించింది. అలాకానీపక్షంలో యుద్ధానికి సిద్ధమని చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గ్లోబల్‌టైమ్స్ పత్రికలో ఈ మేరకు ఓ వ్యాసాన్ని ప్రచురించింది. 
 
భారత్, చైనా, భూటాన్ సరిహద్దు ప్రాంతమైన డోక్లామ్‌లో చైనా నిబంధనలకు విరుద్ధంగా భారత భూభాగంలోకి ప్రవేశించి రోడ్డును నిర్మిస్తోంది. దీన్ని భారత్, భూటాన్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అదేసమయంలో ఈ రోడ్డు నిర్మాణాన్ని భారత బలగాలు అడ్డుకోవడంతో చైనా కూడా భారీ సంఖ్యలో బలగాలను మొహరించారు. దీంతో సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 
ఈ నేపథ్యంలో చైనా మీడియా మరోసారి నోటి దురుసును ప్రదర్శించింది. సిక్కిం సరిహద్దులో భారత బలగాలు అక్రమంగా చైనా భూభాగంలోకి చొచ్చుకొచ్చాయని ఆరోపిస్తూ, తమ భూభాగాన్ని కాపాడుకోవడానికి యుద్ధం చేసేందుకైనా వెనుకాడబోమని ప్రకటించింది. భారత్-చైనా సరిహద్దు (ఎల్‌ఏసీ) వెంట అనేక చోట్ల భారత్ నిబంధనలు ఉల్లంఘించి సమస్యలు సృష్టిస్తున్నదని ఆరోపించింది. 
 
భారత సైన్యంతో తాము ఘర్షణపూరిత వాతావరణాన్ని కోరుకోవడం లేదని, సామరస్యంగా సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వ్యాసంలో పేర్కొన్నది. మరోవైపు సరిహద్దు సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని చైనా విదేశాంగశాఖ భారత ప్రభుత్వానికి సూచించింది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments