Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా సైనిక సామర్థ్యం పెరుగుతోంది.. పాక్‌లో పట్టుబిగిస్తోంది... భారత్‌కు పెంటగాన్ హెచ్చరిక

Webdunia
శనివారం, 14 మే 2016 (15:21 IST)
చైనా, పాకిస్థాన్ దేశాలు కలిసి భారత్‌పై యుద్ధానికి వస్తాయా? భారత సరిహద్దుల్లో సైనిక బలగాల మొహరింపు సామర్థ్యం నానాటికీ పెంచడానికి కారణమేంటి? మరోవైపు పాకిస్థాన్ బలపడటం వెనుక అంతరార్థం ఏంటి? ఈ ప్రశ్నలకు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం సమాధానం చెపుతోంది. 
 
భారతదేశ సరిహద్దుల్లో చైనా సైనిక సామర్థ్యం పెరుగుతోందని, చైనా సైనిక దళాలు, స్థావరాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్నట్లు, ముఖ్యంగా పాకిస్థాన్‌లో బలపడుతున్నట్లు తెలిపింది. ప్రజా గణతంత్ర చైనాకు సంబంధించిన సైనిక, భద్రత పరిణామాలపై పెంటగాన్ 2016వ సంవత్సరానికి రూపొందించిన నివేదికను అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించింది.
 
అయితే, చైనా వైఖరి వెనుకనున్న అసలు ఉద్దేశాన్ని చెప్పడం కష్టమని పెంటగాన్ పేర్కొంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా పాకిస్థాన్‌లో చైనా స్థావరాలు, బలగాలు పెరుగుతున్నాయని అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది. 
 
పాకిస్థాన్‌తో చైనాకు దీర్ఘకాలిక స్నేహ సంబంధాలు, వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపింది. అంతర్జాతీయంగా చైనా ఆర్థిక ప్రయోజనాలు విస్తరిస్తుండటంతో సుదూర సముద్రాల్లో చైనా నావికాదళం సేవలు అవసరమని భావిస్తోందని పేర్కొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments