Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో కరోనా మృత్యుకేళి... ఒకే రోజు 240 మంది మృతి

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (09:00 IST)
చైనాలో కరోనా వైరస్ మరణ మృదంగం కొనసాగిస్తోంది. ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ముఖ్యంగా, ఒకే రోజు 240 మంది చనిపోయారు. ఈ మృత్యుకేళి హుబేయ్ ప్రావిన్స్‌లో సంభవించింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌ర్వాత ఇంత ఎక్కువ స్థాయిలో మ‌ర‌ణాలు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టిసారి. 
 
అలాగే, ఒక్క బుధవారమే దేశ వ్యాప్తంగా కొత్తగా 15 వేల కేసులు నమోదయ్యాయి. హుబేయ్ కేంద్రంగా విస్త‌రిస్తున్న క‌రోనా వైర‌స్‌కు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా కోవిద్‌-19 అని పేరు పెట్టింది. దేశ‌వ్యాప్తంగా సుమారు 60 వేల కోవిద్‌-19 కేసులు న‌మోదు అయిన‌ట్లు వెల్లడించింది. మరోవైపు, క‌రోనా వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య అధికారికంగా 1310కి చేరుకున్న‌ది. 
 
అయితే, హుబేయ్‌లో ఒక్క రోజు 242 మ‌ర‌ణించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. దాంట్లో 135 కేసుల‌ను క్లినిక‌ల్‌గా గుర్తించారు. మిగితా 107 మందికి కూడా కొత్త వైర‌స్ సోకిన‌ట్లు అనుమానిస్తున్నారు. కేవ‌లం హుబేయ్ ప్రావిన్సులోనే 48 వేల ఇన్‌ఫెక్ష‌న్ కేసుల‌ను డాక్ట‌ర్లు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments