Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాకు చిర్రెత్తుకొచ్చింది.. లేడీ గాగా ఆల్బమ్స్‌పై నిషేధం.. దలైలామా తోడేలంటూ ఫైర్!

టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాపై చైనా ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతుంది. దలైలామాతో ఎవ్వరు కలిసినా వారిపై కూడా చైనాకు కోపం వస్తుంది. అంతేకాకుండా దలైలామాను కలిసిన వారిని నిషేధిత జాబితాలో చేర్చడం చైనాకు పర

Webdunia
బుధవారం, 29 జూన్ 2016 (15:22 IST)
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాపై చైనా ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతుంది. దలైలామాతో ఎవ్వరు కలిసినా వారిపై కూడా చైనాకు కోపం వస్తుంది. అంతేకాకుండా దలైలామాను కలిసిన వారిని నిషేధిత జాబితాలో చేర్చడం చైనాకు పరిపాటి. తాజాగా ఆ జాబితాలో పాపులర్ పాప్ గాయని లేడీ గాగా కూడా చేరిపోయింది. ''లేడీ గాగా" ఆల్బమ్స్‌ అన్నింటినీ అక్కడి కమ్యూనిస్టు పార్టీ నిషేధించింది. ఇందుకు గాగా దలైలామాతో భేటీ కావడమే కారణం. 
 
ఇండియానాపొలిస్‌లో జూన్‌ 26న దలైలామాతో లేడీ గాగా సమావేశమయ్యారు. ఈ చర్చలో భాగంగా మానసిక ధృఢత్వం, ఆధ్యాత్మికత, ధ్యానం, ప్రపంచంలో అవినీతిని ఎదుర్కోవడం వంటి విషయాల గురించి గాగా దలైలామాతో 19 నిమిషాలపాటు చర్చించారు. 
 
లేడీ గాగా ఆ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేయడంతో చైనాకు చిర్రెత్తుకొచ్చింది. అంతేకాదు.. చైనా ప్రజలు కూడా దలైలామా-గాగాల భేటీపై మండిపడుతున్నారు. అంతటితో ఆపకుండా దలైలామాను సన్యాసి వేషంలో ఉన్న తోడేలుగా అభివర్ణిస్తే, గాగా ఆల్బమ్స్‌పై కమ్యూనిస్ట్ పార్టీ నిషేధం విధించింది.

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments