Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగులకను డేటింగ్‌కు ప్రోత్సహిస్తున్న చైనా కంపెనీ... పార్ట్‌నర్‌ను వెతికిపెట్టినా సరే...

ఠాగూర్
గురువారం, 21 నవంబరు 2024 (16:00 IST)
దక్షిణ కొరియాకు చెందిన ఓ కంపెనీ తమ కంపెనీలో పని చేస్తే ఉద్యోగులను మరింతగా సంతోష పెట్టడానికి వీలుగా ఓ వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులోభాగంగా, మూడు నెలలో పాటు డేటింగ్‌లో ఉంటే వెయ్యి యువాన్లును బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులను అన్ని విధాలుగా సంతోషంగా ఉంచడమే లక్ష్యంగా ఈ వినూత్న విధానాన్ని ఎంచుకున్నట్టు తెలిపారు.
 
ఒంటరిగా జీవిస్తున్న ఉద్యోగులను డేటింగ్ వైపునకు పురిగొల్పేలా, ఇందుకోసం నగదు ప్రోత్సాహకాలను కూడా ఆఫర్ చేస్తోంది. దక్షిణ చైనాలోని షెన్జెన్ వేదికగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 'ఇన్‌స్టా 360' అనే టెక్ కంపెనీ ఒంటరి ఉద్యోగులను డేటింగ్ చేయాలంటూ ప్రోత్సహిస్తోంది. కంపెనీ వెలుపల వ్యక్తులతో డేటింగ్ మొదలుపెట్టామంటూ కంపెనీకి చెందిన డేటింగ్ ప్లాట్‌ఫామ్ పార్టనర్‌ను పరిచయం చేస్తూ చెల్లుబాటయ్యే పోస్ట్ పెడితే 66 యువాన్లు (సుమారు రూ.770) చెల్లిస్తామని కంపెనీ ప్రకటించింది.
 
డేటింగ్‌ను మూడు నెలల పాటు కొనసాగిస్తే డేటింగ్‌లో ఉన్న జంటతో పాటు మ్యాచ్ వెతికిపెట్టినవారికి కూడా 1,000 యువాన్లు (సుమారు రూ. 11,650) చొప్పున రివార్డ్ అందిస్తామని కంపెనీ ప్రకటించినట్టు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' కథనం పేర్కొంది.
 
ఉద్యోగుల్లో 'మనది అనే భావన' కలిగించడంతో పాటు వారిలో సంతోషాన్ని నింపాలనే లక్ష్యంతో ఈ విధంగా ప్రోత్సహిస్తున్నట్టు ఇన్‌స్టా 360 కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన నాటి నుంచి కంపెనీ డేటింగ్ ప్లాట్‌ఫామ్‌పై దాదాపు 500 పోస్టులు పబ్లిష్ అయ్యాయని, దాదాపు 10,000 యువాన్ల మేర కంపెనీ నగదు అవార్డులను అందజేసిందని వెల్లడించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments