Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో గొడవ.. జాతివివక్షకే కారణమా.. ఆఫ్రో-అమెరికన్ మహిళ కంటతడి.. (వీడియో)

అమెరికాకు చెందిన ఓ విమానంలో ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూస్తుంటే జాతి వివక్ష వ్యాఖ్యలు కూడా గొడవకు కారణమని సమాచారం.

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2016 (11:45 IST)
అమెరికాకు చెందిన ఓ విమానంలో ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూస్తుంటే జాతి వివక్ష వ్యాఖ్యలు కూడా గొడవకు కారణమని సమాచారం. 
 
ఎంతసేపటికీ రెండు వర్గాల వారు వెనక్కి తగ్గని పరిస్థితుల్లో పైలట్ జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఈ వాగ్వివాదం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి మెక్సికో(ప్యుయెర్టా వాల్లార్టా)కు వెళ్లే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో చోటుచేసుకుంది. జాన్ బ్యుయర్ అనే వ్యక్తి విమానంలో జరిగిన తతంగాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో స్థానికంగా ఎంతో కలకలం రేపింది. 
 
ఈ వీడియో ఆఫ్రో-అమెరికన్ మహిళను అగౌరవపరిచే వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వ్యవహారం పైలట్ వరకు వెళ్ళింది. పైలట్ రంగంలోకి దిగి సర్దిచెప్పాడు. విమానంలో గొడవ జరిగింది నిజమేనని యునైటెడ్ ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి మెక్ కార్తే ధ్రువీకరించారు. అయితే గొడవ సర్దుకుందని.. విమానంలో నుంచి ఎవర్నీ దించలేదని చెప్పారు.
 

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments