Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూడ్ బీచ్‌‌లో కండోమ్స్‌, బీరు సీసాలు, లో దుస్తులే ఉంటాయి.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 13 జనవరి 2016 (06:14 IST)
సాధారణంగా విదేశీ బీచ్‌లంటే పర్యాటకులు న్యూడ్, సెమీ న్యూడ్ ఫోజుల్లో కనిపిస్తుంటారు. కానీ, ఒక బీచ్‌ను పూర్తిగా న్యూడ్ బీచ్‌గా ప్రకటిస్తే.. ఇక ఆ బీచ్‌లో జంటలు ఏ విధంగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఆ న్యూడ్ బీచ్‌ న్యూజీలాండ్‌లోని కేప్‌టౌన్‌లో ఉంది. దీనిపేరు పెంజాతీ బీచ్. అయితే, ఈ న్యూడ్ బీచ్‌లో వాడిపారేసిన కండమ్స్, లో దుస్తులు, ఖాళీ బీరుబాటిల్సే అధికంగా దర్శనమిస్తున్నాయి. దీంతో బీచ్ అపరిశుభ్రంగా తయారవుతుందని స్థానికులు వాపోతున్నారు. 
 
నిజానికి కేప్‌టౌన్‌లోని ఈ బీచ్‌ను అధికారికంగా న్యూడ్‌ బీచ్‌గా మార్చుతూ 2014లో స్థానిక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్నుంచీ ఈ బీచ్‌కు సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఫెస్టివ్‌ సీజన్‌లో దేశ విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు ఇక్కడ చాలా బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇక్కడ 20 సంవత్సరాల నుంచి న్యూడ్‌ కల్చర్‌ ఉన్నప్పటికీ.. 2014లోనే అధికారిక గుర్తింపు లభించింది. అప్పటి నుంచి విదేశీ పర్యాటకుల తాకిడి ఎక్కువ కావంతో పాటు.. స్థానికులకు ఇబ్బందులు తలెత్తాయి. 
 
న్యూడ్‌ బీచ్‌గా మార్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఎక్కువగా వాడి పారేసిన కండోమ్స్‌, బీరు సీసాలు, లో దుస్తులే దర్శనిమిస్తున్నాయట. విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ బీచ్‌ను సర్వ నాశనం చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. పైపెచ్చు... చిన్న పిల్లలతో ఈ బీచ్‌కు రావాలంటే చాలా భయపడుతున్నారనీ, అందువల్ల నాన్ న్యూడ్ బీచ్‌గా ప్రకటించాలని కోరుతున్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments