Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరేబియన్ దీవుల్లో నరమాంస భక్షకులు!

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (09:35 IST)
ప్రపంచ యాత్రికుడు క్రిష్టోఫర్‌ కొలంబస్‌ 500 ఏళ్ల కిందట చెప్పిన విషయం నిజమేనని తాజాగా శాస్త్రవేత్తలు తేల్చారు. కరేబియన్ దీవుల్లో దక్షిణ అమెరికాకు చెందిన కరీబీ  నరమాంస భక్షకులు తనకు తారపడినట్లు ఆయన చెప్పిన కథనాన్ని ధ్రువీకరించారు.

తొలినాటి కరేబియన్ వాసుల పుర్రెలను ‘ఫేషియల్‌ రికగ్నిషన్‌’ సాంకేతికతతో పరిశీలించి ఈ మేరకు నిర్ధరించారు.
1492లో తాను కరేబియన్ ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు దక్షిణ అమెరికాకు చెందిన కరీబ్‌ ఆక్రమణదారులు కనిపించినట్లు కొలంబస్‌ పేర్కొన్నారు.

వీరు జమైకా, హిస్పానియోలా, బహమాస్‌ దీవులపై దాడి చేసి, అక్కడ శాంతియుతంగా నివసించే అరావాక్‌ తెగ మహిళలను నిర్బంధించి, పురుషులను చంపి తినేవారని చెప్పారు. వీరిని తొలుత ఆయన ‘కనిబా’ జాతిగా పొరబడ్డారు. ఆ తర్వాత వచ్చిన స్పానిష్‌ యాత్రికులు దాన్ని ‘కరీబీ’గా సరిచేశారు.

అయితే చాలాకాలంగా కొలంబస్‌ వాదనతో పురావస్తు శాస్త్రవేత్తలు విభేదిస్తూ వచ్చారు. వెయ్యి మైళ్లు ప్రయాణం చేసి కరీబీలు అక్కడికి ఎలా వెళ్లి ఉంటారన్నది వారి సంశయం. కొలంబస్‌ తర్వాత వందేళ్లకు కాని కరీబీలు ఆ దీవులకు వెళ్లి ఉండరని అంచనావేశారు.

అయితే కరేబియన్ ప్రాంతంలో కనిపించిన వంద పురాతన పుర్రెలను తాజాగా శాస్త్రవేత్తలు విశ్లేషించారు. కొలంబస్‌ యాత్ర సమయంలో కరీబీలు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. వీరు క్రీస్తు శకం 800 సంవత్సరంలోనే అక్కడికి వెళ్లినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments