Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కీలక నిర్ణయం.. భారత ప్రయాణీకులపై నిషేధం

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (11:57 IST)
కరోనా మూడో వేవ్ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల దృష్ట్యా, భారత్ నుంచి వచ్చే ప్రయాణీకుల విమానాలపై నిషేధాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధాన్ని సెప్టెంబర్ 21వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఫెడరల్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్ట్రీ ఈమేరకు సమాచారాన్ని ఇచ్చింది.
 
ఇంతకుముందు ఆగస్టు 21వ తేదీ వరకు నిషేధం అమల్లో ఉండగా.. అది ఇప్పుడు సెప్టెంబర్ 21 వరకు పొడిగించారు. వాస్తవానికి, కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ సమయంలో డెల్టా వేరియంట్‌ల దృష్ట్యా, కెనడియన్ ప్రభుత్వం, ఏప్రిల్ 22న మొదటిసారి భారత్‌పై నిషేధం విధించింది. తాజాగా సెప్టెంబర్ 21 వరకు ఈ నిషేధాన్ని పొడిగించబడింది. ప్రజారోగ్య ప్రాధాన్యం మేరకు నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
 
అంతేకాదు.. భారతదేశం నుంచి కెనడాకు థర్డ్ కంట్రీ ప్రీ-డిపార్చర్ ద్వారా వెళ్లే ప్రయాణీకులకు కెనడా ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. ప్రయాణీకులకు కోవిడ్ నెగటివ్ RT-PCR పరీక్షలు అవసరం అని చెప్పారు. క్వారంటైన్ కంపల్సరీ అని స్పష్టం చేసింది. అదే సమయంలో, సెప్టెంబర్ నెలకి కరోనా పరిస్థితి మెరుగుపడితే, సెప్టెంబర్ 7 నుంచి పూర్తిగా టీకాలు వేయించుకున్న ప్రయాణికులకు సరిహద్దులను తెరుస్తామని ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments