ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఓ పనికి మాలిన వ్యక్తి.. చెప్పిందెవరంటే?

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (13:42 IST)
Maryam Nawaz shariff
ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఓ పనికి మాలిన వ్యక్తి అని, దేశంలో ఏం జరుతుతుందో ఆయనకు కనీస అవగాహన కూడా లేదని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పాకిస్థాన్ ముస్లింలీగ్ నవాజ్ పార్టీ (పీఎంఎల్‌-ఎన్‌) ఉపాధ్యక్షురాలు మర్యం నవాజ్‌ షరీఫ్‌ ఆరోపించారు. ఈశాన్య పాకిస్థాన్‌లో ఎన్నికల ప్రచారం అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడారు. 
 
ప్రధాని మాటను ఏ ఒక్కరూ పట్టించుకునే స్థితిలో లేరని అందుకే ఆయన తన అధికార నివాసంలో ప్రశాంతంగా నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. పాకిస్థాన్‌ ప్రజల కష్టాలు తీరాలంటే ఇమ్రాన్‌ నకలీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని మర్యం నవాజ్‌ అన్నారు. దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తే గౌరవప్రదమైన వారు ఎన్నుకోబడతారని పేర్కొన్నారు.
 
కరాచీలో తన ఇంటిపై దాడి చేసి తలుపులు ధ్వంసం చేశారని, తన భర్త సఫ్‌దార్‌ను అరెస్టు చేశారని, సింద్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఐజీపీ) అపహరణకు గురయ్యారని ఇదంతా ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు తెలియకుండానే జరిగిందా అని ఆమె ప్రశ్నించారు. జైలు గదుల్లో, బాత్రూమ్‌లో కెమెరాలు వుంచారని ఆమె ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కాంతార చాప్టర్-1'కు ఆటంకాలు కలిగించొద్దు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ 'ఓజీ' కోసం ఒక్కతాటిపైకి మెగా ఫ్యామిలీ

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

Rashmika : హారర్‌ కామెడీ యూనివర్స్ చిత్రం థామా అలరిస్తుంది: రష్మిక మందన

Prabhas: ఫన్, ఫియర్, ఆల్ట్రా స్టైలిష్ గా ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments