Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసూద్‌పై ఆధారాలున్నాయా.. అయితే చూపండన్న చైనా: తోసిపుచ్చిన భారత్

జైషే మొహమ్మద్‌ అధినేత మసూద్‌ అజర్‌ దుశ్చర్యలన్నిటికీ ‘పక్కాఆధారాలు’ ఉన్నాయని భారత్‌ స్పష్టం చేసింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని బ్రిటన్, ఫ్రాన్స్‌ మద్దతుతో అమెరికా ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో చేసిన ప్రతిపాదనకు చైనా మోకాలడ్డిన సంగతి తెలిస

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (04:41 IST)
జైషే మొహమ్మద్‌ అధినేత మసూద్‌ అజర్‌ దుశ్చర్యలన్నిటికీ ‘పక్కాఆధారాలు’ ఉన్నాయని భారత్‌ స్పష్టం చేసింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని బ్రిటన్, ఫ్రాన్స్‌ మద్దతుతో అమెరికా ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో చేసిన ప్రతిపాదనకు చైనా మోకాలడ్డిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో సరైన ఆధారాలు చూపాలన్న చైనా డిమాండ్‌పై భారత్‌ తాజాగా స్పందించింది. 
 
ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్‌. జైశంకర్‌ మాట్లాడుతూ తమ వద్ద మసూద్‌ దుశ్చర్యలకు సంబంధించి సరైన ఆధారాలు ఉన్నాయన్నారు.
అయితే ఈ విషయంపై ఇతర దేశాలను ఒప్పించాల్సిన బాధ్యత భారత్‌పై లేదన్నారు. దీనిపై ఐరాసలో దరఖాస్తు పెట్టిన దేశాలు మసూద్‌కు సంబంధించి బాగా తెలిసుకున్నాయి కాబట్టే ఆ ప్రతిపాదన చేశాయని.. లేకుంటే అసలా ప్రస్తావనే తెచ్చేవి కావని అన్నారు. 
 
ఎస్‌. జైశంకర్‌ బుధవారం చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ ఇతో సమావేశమయ్యారు. ఇండో–చైనా వ్యూహాత్మక సమావేశాల్లో భాగంగా ఇది జరిగింది. ఎన్‌ఎస్‌జీ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్‌ సభ్యత్వంపై చైనా సానుకూలంగా ఉందన్నారు. అయితే విధివిధానాలపై ఆ దేశానికి తనదైన వైఖరి ఉందన్నారు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments