Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌లో కొత్త రకం స్ట్రెయిన్.. వ్యాక్సిన్లు పనిచేయకపోవచ్చు..

Webdunia
ఆదివారం, 17 జనవరి 2021 (09:38 IST)
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాకు వ్యాక్సిన్ వచ్చేసినా.. వైరస్ మహమ్మారి ధాటికి ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణుకుతుంది. కరోనా వైరస్ ఒక్కో దేశంలో ఒక్కో విధంగా రూపాంతరం చెందుతూ ఆందోళన కలిగిస్తోంది.

బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ ఆ దేశాన్ని ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తోందో చెప్పక్కర్లేదు. అదే విధంగా దక్షిణాఫ్రికా, నైజీరియాలో వెలుగుచూసిన కొత్త వైరస్ లు కూడా ఆయాదేశాల్లో విజృంభిస్తున్నాయి. 
 
తాజాగా బ్రెజిల్‌లో కూడా కొత్తరకం కరోనా స్ట్రెయిన్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా వైరస్ పది రకాలుగా రూపాంతరం చెందినట్టు నిపుణులు గుర్తించారు. బ్రెజిల్‌లో వెలుగుచూసిన కొత్తరకం స్ట్రెయిన్, బ్రిటన్, దక్షిణాఫ్రికాలో గుర్తించిన స్ట్రెయిన్‌ల కంటే ఎక్కువ జన్యురూపాంతరం చెందినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. 
 
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఈ కొత్తరకం స్ట్రెయిన్ పై పనిచేయకపోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. బ్రెజిల్‌లో వెలుగుచూసిన కొత్త స్ట్రెయిన్‌కు సంబంధించిన కేసులు జపాన్‌లో కూడా నమోదవుతున్నాయి. అయితే, ఇండియాలో నెక్స్ట్ స్ట్రెయిన్ కేసులు నమోదు కాలేదని పరిశోధకులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments