Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ నెల వరకు లాక్ డౌన్ పొడిగింపు.. బ్రిటన్ ప్రధాని బోరిస్

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (20:06 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజల రక్షణార్థం జూన్ నెల వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. కరోనా వ్యాధికి గురై.. చికిత్స పొంది కోలుకున్న అనంతరం, సుమారు పదిహేను రోజులుగా పాలనాపరమైన బాధ్యతలకు దూరంగా ఉన్న ఆయన గురువారం మొదటిసారిగా మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారు. 
 
బ్రిటన్ దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించాల్సిందేనని పలువురు మంత్రులు ఆయనను కోరారు. లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన పక్షంలో వేలాది కరోనా రోగులు మృత్యు బాట పట్టవచ్చునని, కరోనా మరింతగా విజృంభించే సూచనలు ఉన్నాయని వైద్యులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రాణ నష్టం వద్దు.. ఓపిక పట్టండని బ్రిటన్ పౌరులకు ప్రధాని సందేశం ఇచ్చారు. కరోనా కట్టడికి చేసేది ఏమిలేక స్వీయ నియంత్రణ పాటిస్తున్నాయనే విషయాన్ని బ్రిటన్ ప్రధాని గుర్తు చేశారు.  
 
తాజాగా బ్రిటన్ దేశం జూన్ వరకు లాక్ డౌన్‌ను పొడిగించినట్టు ప్రకటించింది. కాగా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఇదొక్కటే మార్గంగా దేశాలన్నీ లాక్ డౌన్ విదానాన్నే అమలు చేస్తున్నాయి. దాదాపు 120 దేశాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేదుకు ఈ స్వీయ నియంత్రిణ ఆయుధాన్నే వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments