Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఫ్ఘానిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి... 50 మంది దుర్మరణం

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (11:38 IST)
అఫ్ఘానిస్థాన్‌లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి జరిపారు. వాలీబాల్ టోర్నమెంట్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 50 మంది మృతి చెందగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని పక్తికా ప్రావిన్స్‌లోన ఉన్న యాహ్యా ఖైల్‌లో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతుండగా, అక్కడికి మోటార్ సైకిల్‌పై వచ్చిన ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. 
 
గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని డిప్యూటీ గవర్నర్ అతావుల్లా ఫజిల్ వెల్లడించారు
 
అయితే ఈ ఆత్మాహుతి దాడికి సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. దేశంలో అత్యంత క్లిష్టమైన పక్తికా ప్రాంతంలో గత జూలైలోనూ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడిలో 41 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments