Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు దొంగతనం చేశారనీ.. విషపూరిత చీమలతో కుట్టించి చంపేశారు.. ఎక్కడ?

దక్షిణ అమెరికాలోని బొలీవియా ప్రావీన్స్ కరనావి మున్సిపాలిటీలో ఓ దారుణం జరిగింది. కారు దొంగతనం చేశారన్న ఆరోపణలపై తల్లీకుమార్తెలను చెట్టుకు కట్టేసి.. విషపూరిత దోమలతో కుట్టించి చంపేసిన ఘటన ఒకటి తాజాగా వెల

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (08:38 IST)
దక్షిణ అమెరికాలోని బొలీవియా ప్రావీన్స్ కరనావి మున్సిపాలిటీలో ఓ దారుణం జరిగింది. కారు దొంగతనం చేశారన్న ఆరోపణలపై తల్లీకుమార్తెలను చెట్టుకు కట్టేసి.. విషపూరిత దోమలతో కుట్టించి చంపేసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషపూరిత చీమ‌లు వారి శ‌రీరాన్ని కొరికి తింటుంటే వారు చేసిన ఆర్త‌నాదాల‌తో ఆ ప్రాంతం మార్మోగింది. అయినా వారి గుండెలు క‌ర‌గ‌లేదు. శ‌రీరాన్ని ముక్క‌లుగా కొరికేసిన చీమ‌లు ఓ మ‌హిళ గొంతును చీల్చుకుని లోప‌లికి చొచ్చుకెళ్లాయి. దీంతో ఆమె మృతి చెందింది. 
 
ఈ హృద‌య‌ విదార‌క ఘ‌ట‌న వివరాలను పరిశీలిస్తే... స్థానికంగా నివ‌సించే ఓ కుటుంబానికి చెందిన కారు ఇటీవ‌ల చోరీకి గురైంది. ఆ చోరీకి పాల్ప‌డింది స‌మీపంలో ఉండే యువ‌కుడి ప‌నేన‌ని అనుమానించిన కొంద‌రు అత‌డిని ప‌ట్టుకొచ్చి చెట్టుకు క‌ట్టేశారు. అడ్డుకున్న అత‌డి సోద‌రి, త‌ల్లి(52)ని కూడా క‌ట్టేశారు. అనంత‌రం వారిపైకి విష‌పు చీమ‌ల‌ను వ‌దిలి చిత్ర‌హింస‌ల‌పాలు చేశారు. 
 
వారు కేక‌లు వేస్తున్నా వారి హృద‌యాలు క‌ర‌గ‌లేదు. అంద‌రూ చోద్యం చూస్తూ మిన్నకుండిపోయారు. చివ‌రికి స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని వారిని రక్షించారు. ఒళ్లంతా గాయాల‌తో ప‌రిస్థితి విష‌మంగా ఉన్న మ‌హిళ‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించగా అక్క‌డ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. 
 
చీమ‌లు ఆమె గొంతు నుంచి లోప‌లికి చొచ్చుకెళ్లి లోప‌లి భాగాల‌ను కొర‌క‌డం వ‌ల్లే ఆమె మృతి చెంది ఉంటుంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. కాగా, కారు చోరీకి, బాధిత కుటుంబానికి ఎటువంట‌టి సంబంధం లేద‌ని ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments