డోక్లామ్ నుంచి వెళ్ళిపోండన్న చైనా.. శీతాకాలం వచ్చినా కదిలేది లేదన్న భారత్

భారత్-చైనాల మధ్య డోక్లామ్ వివాదం రోజు రోజుకీ రాజుకుంటోంది. డోక్లామ్ సరిహద్దుల నుంచి తమ దళాలను ఉపసంహరించుకోవాలని చైనా భారత్‌కు సూచించింది. అయితే భారత్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే వెనక్కి తగ్గేది లేదని

Webdunia
గురువారం, 13 జులై 2017 (13:51 IST)
భారత్-చైనాల మధ్య డోక్లామ్ వివాదం రోజు రోజుకీ రాజుకుంటోంది. డోక్లామ్ సరిహద్దుల నుంచి తమ దళాలను ఉపసంహరించుకోవాలని చైనా భారత్‌కు సూచించింది. అయితే భారత్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే వెనక్కి తగ్గేది లేదని స్పష్టమైన సంకేతాలు పంపింది. గతంలో భారత్-చైనాల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయని.. కానీ డోక్లామ్‌లో మాత్రం ఇప్పుడు భారతదళాలు చైనా భూభాగంలోకి చొచ్చుకువచ్చాయని చైనా విదేశాంగ ప్రతినిధి గెంగ్ షువంగ్ విమర్శించారు. భారత్‌లోని సిక్కింతో చైనా సరిహద్దులు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు.
 
కానీ డోక్లామ్ విషయంలో భారత్ మరోసారి సమీక్ష నిర్వహించి వెంటనే వెనక్కి వెళ్లాలని సూచించారు. డోక్లామ్‌లో భారతదళాలు ఆక్రమణకు దిగాయని ఆరోపించారు. చైనాతో గతంలో ఏర్పడిన సరిహద్దు వివాదాలు ఎప్పటికప్పుడు చర్చల ద్వారా పరిష్కారమయ్యాయని భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ గెంగ్ షువంగ్ పై వ్యాఖ్యలు చేశారు. 
 
అయితే డోక్లాం నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని, శీతాకాలంలో డోక్లామ్ సరిహద్దుల్లో ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొనేందుకు శాశ్వత నిర్మాణాలు చేపట్టి, మరింత మంది సైనికులను పంపాలని భారత్ వెల్లడించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments