Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్ ఖైదా- ఐసిస్ ఏకం కానున్నాయా? ఇంకేమైనా వుందా?

అల్‌ఖైదా మళ్లీ పుంజుకునేందుకు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థతో చేతులు కలపనుందా? ఐసిస్‌‍తో కలిపి మానవ హతానికి అల్ ఖైదా పన్నాగాలు వేస్తుందా? అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. పశ్చిమ దేశాలకు చెందిన ఇంటలిజెన్

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2017 (17:56 IST)
అల్‌ఖైదా మళ్లీ పుంజుకునేందుకు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థతో చేతులు కలపనుందా? ఐసిస్‌‍తో కలిపి మానవ హతానికి అల్ ఖైదా పన్నాగాలు వేస్తుందా? అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. పశ్చిమ దేశాలకు చెందిన ఇంటలిజెన్స్ వర్గాలు ప్రస్తుతం అల్ ఖైదా కదలికలపై పూర్తిగా దృష్టి సారించాయి. అందుకు కారణం అల్ ఖైదా సంస్థకు బిన్ లాడెన్ తర్వాత వారసుడు రావడమే.
 
అమెరికా సైన్యం చేతిలో బిన్ లాడెన్ హతమయ్యాక ఇప్పటి వరకూ ఆల్‌ఖైదాకు నాయకుడు లేడు. ఇప్పుడు కొత్త వారసుడు వచ్చాడన్న ప్రచారం ముమ్మరమైంది. ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్‌కు అల్ ఖైదా పగ్గాలు అప్పగించారని వార్తలు షికార్లు చేస్తున్నాయి. జీహాదీని ఉద్దేశించి హంజా పంపిన సందేశం అనేక టీవీ ఛానళ్లలో ప్రసారమైంది. దీంతో పశ్చిమ దేశాల ఇంటెలిజెన్స్ సంస్థలు హంజా గురించి ఆరా తీస్తున్నాయి.
 
ఇదిలా ఉంటే.. ప్రపంచ దేశాలను వణికించిన అల్‌ఖైదా ఒసామా బిన్ లాడెన్ హత్యతో కథ ముగిసిందనుకుంటే.. బిన్ లాడెన్ కుమారుడు 28 ఏళ్ల హంజా  అల్ ఖైదా పగ్గాలు చేపట్టారని వార్తలు వస్తున్నాయి. ఒసామాకు ఉన్న 20 మంది సంతానంలో హంజా 15వ వాడని.. ఇతడు బిన్ లాడెన్ మూడో భార్య ఖైరియా సబర్ కుమారుడు. ఖైరియా అంటే ఒసామాకు ప్రాణం. ఇష్టం కూడా.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments