అంతర్జాతీయ సమాజాన్ని గడగడలాడించి.. అమెరికాలోని ట్విన్ టవర్స్‌ను నేలకూల్చిన కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్. పాకిస్థాన్ డాక్టర్ సహకారంతో అమెరికాకు నావికా దళానికి చెందిన సీల్స్ విభాగం మెరుపుదాడి చేసి హతమార్చింది. ఈ దాడిని ఎలా చేసిందో లైవ్‌లో వివరిస్తూ సీఐఏ తన సోషల్ నెట్‌వర్క్ సైట్ ట్విట్టర్‌లో ట్వీట్ల రూపంలో కళ్లకుకట్టినట్టు వివరించింది. లాడెన్‌ను హతమార్చి ఐదేళ్లు అయిన సందర్భంగా ఈ ట్వీట్స్ చేసింది.
ఈ సందర్భంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అమెరికా అబొట్టాబాద్ ఆపరేషన్ రహస్యాలను మళ్లీ జరిగినట్లుగానే పేర్కొంది. సీఐఏ ప్రయత్నాలపై విమర్శలు వెల్లువెత్తినా ట్వీట్లు మాత్రం ఆపరేషన్‌ను ఆసక్తికరంగా ప్రజెంట్ చేయడం గమనార్హం. నెప్ట్యూన్ స్పియర్ పేరుతో సాగిన ఆ ఆపరేషన్‌ను ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. అబొట్టాబాద్ ఆపరేషన్‌ను అధ్యక్షుడు ఒబామా సిచ్యువేషన్ రూమ్ నుంచి స్వయంగా వీక్షించారు. ఆ ఫోటోను కూడా రిలీజ్ చేశారు.
సీఐఏ తన ట్విట్టర్ ఫాలోవర్లకు ఆదివారం ఈ అవకాశాన్ని కల్పించింది. యూబీఎల్ రెయిడ్ హ్యాస్‌ట్యాగ్‌తో లాడెన్ డెత్ స్టోరీని ప్రజెంట్ చేశారు. ఆ ఆపరేషన్‌ను సీఐఏ కీర్తించింది. లాడెన్‌ను చంపి, ఆల్-ఖయిదాను సమూలంగా దెబ్బతీసిన ఆ ఘటన ఒకరకంగా రీట్వీట్లతో అమెరికా ప్రజలకు థ్రిల్ పుట్టించింది. అబొట్టాబాద్ కాంపౌండ్‌లో లాడెన్ ఎక్కడున్నాడన్న విషయాన్ని కూడా ట్వీట్ చేశారు. ఆపరేషన్ టైమ్‌లో లాడెన్ మూడవ అంతస్తులో ఉన్నాడు. అక్కడే అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... బూడిదను కూడా చిక్కకుండా చేసింది.